Home / NATIONAL / కేఆర్టీఏ నూతన అధ్యక్షుడిగా సందీప్ కుమార్ మక్తాల

కేఆర్టీఏ నూతన అధ్యక్షుడిగా సందీప్ కుమార్ మక్తాల

న్నడ రాష్ట్ర తెలంగాణ అసోసియేషన్ (కేఆర్టీఏ)నూతన అధ్యక్షుడిగా సందీప్ కుమార్ మక్తాల ఎన్నికయ్యారు.2018-21 ఏడాదికి అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు నిర్వర్తించనున్నసందీప్ కుమార్ కేఆర్టీఏకు రెండో సారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు .కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూర్ లోని కబ్బన్ ప్రెస్ క్లబ్ లో ఈ రోజు శనివారం నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో కేఆర్టీఏ ప్రకటించింది.ఈ క్రమంలో అధ్యక్షుడితో పాటుగా రాష్ట్ర కమిటీను ఈ సందర్భంగా ప్రకటించారు.కన్నడ రాష్ట్ర తెలంగాణ అసోసియేషన్ సరిగ్గా ఆరేండ్ల కిందట అంటే 2012లో ఏర్పాటైంది.ఏర్పాటైన మొదటి రోజు నుండే తెలంగాణ ఉద్యమానికి అన్నిరకాలుగా మద్దతుగా నిలిచింది.అనంతరం తెలంగాణ రాష్ట్ర పండుగలు,సంస్కృతి,సాహిత్యాన్ని ప్రోత్సహించేందుకు పలు కార్యక్రమాలను నిర్వహించింది.ప్రస్తుతం కూడా ఆ కార్యక్రమాలను కొనసాగిస్తుంది.

కర్ణాటక రాష్ట్ర రాజధాని మహానగరమైన బెంగుళూర్ లో బతుకమ్మ సంబురాలు ,బోనాలు ఎంతో అట్ట హసంగా నిర్వహిస్తోంది.అంతే కాకుండా బెంగుళూర్ లో తెలంగాణ భవన్ ఏర్పాటుకు కూడా ఆర్టీఏ కృషి చేస్తుంది.అందుకు ఇప్పటికే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు అందజేసింది.దీంతో పాటుగా బెంగుళూర్ లో తెలంగాణ ప్రవాసులకు పలురకాలుగా అండగా ఉండటమే కాకుండా అన్ని రకాల సేవలను అందజేస్తుంది.అందుకు విద్య ,వైద్య ,ఉద్యోగాపరమైన పలు అంశాల్లో కేఆర్టీఏ అండగా ఉంటూ వస్తుంది .ప్రస్తుతం కేఆర్టీఏఅధ్యక్షుడిగా ఎన్నికైన సందీప్ కుమార్ ప్రస్తుతం తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్అంతర్జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు .తెలంగాణ రాష్ట్రంలో అనేక అవార్డులను గెలుచుకునే కార్యక్రమాలను టీటా చేపట్టింది .

డిజిటల్ లిటరసీ ప్రోగ్రామ్ ,డిజిథాన్ ,డిజిటల్ యాత్ర లాంటి కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం నుండి వరసగా రెండు యేండ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులను సందీప్ కుమార్ అందుకున్నారు.సాంకేతక అక్షరాస్యత కోసం అహర్నిశలు చేసిన విశేష కృషికి 2015-16,2016-17కి
వరసగా తెలంగాణ ప్రభుత్వ అవార్డులు దక్కాయి.అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా సందీపీ కుమార్ మాట్లాడుతూ రాబోయే మూడు యేండ్లకు తనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కేఆర్టీఏ కమిటీకి కృతఙ్ఞతలు తెలిపారు.ఈ కేఆర్టీఏ ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తాను అని ఆయన వివరించారు .కేఆర్టీఏ కమిటీ నూతన కమిటీలో అధ్యక్షుడిగా సందీప్ కుమార్ మక్తాల ,ఉపాధ్యక్షుడిగా ఈవీ సతీష్ కుమార్ ,ప్రధాన కార్యదర్శిగా చకినాల రాజేందర్ ,నాగేందర్ ,సంయుక్త కార్యదర్శిగా శరత్ చంద్ర బైరు,భవ్య జిల్లెపల్లి ,కోశాధికారిగా నరేష్ జిందం,రజిత,కార్యనిర్వహణ కార్యదర్శిగా హర్ష రామనుజం ,సుమిత్ చందర్ ,అధికార ప్రతినిధిగా కేశవ్ సోని ,కార్యనిర్వాహక సభ్యులుగా దివ్య చకినాల ,ఈవీ అనురాధ,మీడియా సంబంధాలు సిరి నెల్లుట్ల,ప్రధాన సలహాదారులు వి ప్రకాష్ ,సి విఠల్ ,పైళ్ళ శేఖర్ రెడ్డి ,మురళీధర్ రావు ,సంగమేశ్వరరావు,ప్రమోద్ వ్యవహరిస్తారని కేఆర్టీఏ ఎన్నికల కమిటీ 2018 చైర్ పర్శన్ సి దివ్య తెలిపారు ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat