Home / ANDHRAPRADESH / జ‌గ‌న్‌కి ఫోన్ చేసిన ఎమ్మెల్యే ముస్త‌ఫా.. అలాంటి రోజే వ‌స్తే.. రాజ‌కీయాల‌కు గుడ్ బై చెబుతా.. ఇప్పుడు మ‌ళ్ళీ రాసుకోండ‌హే..!

జ‌గ‌న్‌కి ఫోన్ చేసిన ఎమ్మెల్యే ముస్త‌ఫా.. అలాంటి రోజే వ‌స్తే.. రాజ‌కీయాల‌కు గుడ్ బై చెబుతా.. ఇప్పుడు మ‌ళ్ళీ రాసుకోండ‌హే..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నెల్లూరు జిల్లాలో పాద‌యాత్ర చేస్తుంటే.. వైసీపీ ఎమ్మెల్యే ముస్త‌ఫా గుంటూరులో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును క‌ల‌వ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. దీంతో టీడీపీ అనుకూల మీడియాలు ఎడా పెడా త‌మ బుర్ర‌త‌క్కువ బుర్ర‌ల‌కు ప‌ని చెప్పి టీడీపీలోకి జంప్ అవ‌నున్న‌ వైసీపీ ఎమ్మెల్యే అంటూ ప‌చ్చా రాతలు రాసి సోష‌ల్ మీడియాలో వ‌దిలారు.

అయితే అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. గుంటూరులో ఓ ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి సీఎం వెళ్లారు. ఎంపీ రాయపాటి కారులో వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా ప్రత్యక్షమయ్యారు. ఆ వెంటనే ఇద్దరూ కలిసి నేరుగా సీఎం హెలిప్యాడ్ దగ్గరకు వెళ్లి కలిశారు. ముగ్గురు కలిసి పక్కనే ఉన్న బస్సులోకి వెళ్లి… 10 నిమిషాల పాటు చర్చలు జరిపిన సంగ‌తి వాస్త‌వ‌మే. అయితే రాయపాటి కారులో రావడంతో ముస్తఫా పార్టీ మారడం ఖాయమని స‌ద‌రు ఎల్లో మీడియా వారు పిచ్చోళ్లు లాగా రెచ్చిపోయారు.

ఇక ఈ వ్య‌వ‌హారం పై వైసీపీ ముస్తఫా కూడా స్పందించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే చంద్రబాబును కలిశానన్నారు. తన నియోజకవర్గానికి వచ్చిన సీఎంను మర్యాదపూర్వకంగా కలిశానే తప్ప… వైసీపీని వీడే ఛాన్సే లేద‌ని తేల్చిచెప్పారు. టీడీపీలోకి రావాలని ముస్తఫాను… రాయపాటి గతంలోనే ఆహ్వానించారు. ఆయన మాత్రం పార్టీ మారనని చెప్పారు. ఒక‌వేళ అలాంటి రోజే వ‌స్తే రాజ‌కీయాల‌కు గుడ్ బై చెబుతాన‌ని.. నా రాజ‌కీయ న‌డ‌క జ‌గ‌న్ తోనే అని తేల్చి చెప్పాడు. దీంతో ఎల్లో మీడియా ముఖ‌చిత్రాలు మాడిపోయాయ‌ని సోష‌ల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat