విజయవాడ నేతల్లో సయోధ్యను వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కుదిర్చారు. గత కొంతకాలంగా వంగవీటి రాధ పార్టీని వీడుతున్నట్లుప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టిక్కెట్ఇస్తానని జగన్ హామీ ఇవ్వడంతో రాధా వెనక్కు తగ్గారు. అయితే ఇటీవల పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన గౌతంరెడ్డి జగన్ పాదయాత్రలో కలవడంతో మళ్లీరాధాలో అసంతృప్తి బయలుదేరిందంటున్నారు. జగన్ పాదయాత్ర వద్దకు వెళ్లి గౌతమ్ రెడ్డి కలిసిన ఫొటోలో సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. అయితే ఈ వ్యవహారం పై గౌతమ్ రెడ్డి స్పందించారు.
నెల్లూరు పాదయాత్రలో భాగంగా మా అధినేత జగన్‌తో మాట్లాడానని వైఎస్ ఆశయాలను పునికిపుచుకున్న జగన్ వెంట నడవడం తనకి చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇక పాదయాత్రలో ఉన్నప్పుడే జగన్ వంగవీటికి ఫోన్ చేశారని.. తాను కూడా మాట్లాడనని.. వంగవీటి ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారని చెప్పారు. కొన్ని దురదృష్టకర సంఘటల వల్ల నన్ను బహిష్కరించారని ప్రచారం జరిగిందని చెప్పారు. ఇక వైసీపీ నుండి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వంగవీటి రాధాకృష్ణను సెంట్రల్ నియోజకవర్గo నుంచి పోటీ చేస్తారని పార్టీ చెప్పిందని.. ఆ నిర్ణయాన్ని గౌతం రెడ్డి స్వాగతిస్తున్నాని అన్నారు. అంతే కాకుండా రాధాకృష్ణ గెలుపుకు తాను పూర్తిగా సహకరిస్తానని.. మా అధినేత జగన్ ఆదేశాలను పాటిస్తానని కూడా చెప్పారు.