తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ టీఆర్‌ఎస్ ఎంపీలతో సమావేశమై.. పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై పలు కీలక సూచనలు చేశారు.ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ర్టానికి చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలియజేస్తూనే ఇంకా అందాల్సిన సహాయం విషయంలో పట్టుబట్టాలన్నారు. రైతుల సమస్యలను పార్లమెంట్‌లో లేవనెత్తాలని చెప్పారు.మద్దతు ధర విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాబట్టుకోవాలని అన్నారు. రిజర్వేషన్లు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాతో పాటు మిషన్ భగీరథ, వరంగల్ టెక్స్‌టైల్ పార్క్‌కు నిధులు సమకూర్చే విషయంపై ప్రస్తావించాలన్నారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ను వ్యవసాయంతో అనుసంధానం చేయాల్సిన విషయం, సహకార సమాఖ్య స్ఫూర్తికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అంశాలను ఉభయ సభల్లో ప్రస్తావించాలని ఎంపీలకు సూచించారు.
see also : జగన్‌ని కలిసిన గౌతమ్ రెడ్డి.. వెంటనే వంగవీటికి ఫోన్ చేసిన జగన్..!
see also : బ్రేకింగ్ : నిరుద్యోగులకు టీ సర్కార్ మరో శుభవార్త..!