ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రానున్న ఎన్నికల్లో భారతప్రధాన మంత్రి కానున్నారా ..?.ప్రస్తుతం ఉప రాష్ట్రపతిగా ఉన్న ముప్పవరపు వెంకయ్య నాయుడు 2019లో భారత రాష్ట్రపతి కానున్నారా .?.అంటే అవును అనే అంటున్నారు టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ,ఎమ్మెల్సీ వైవిబీ రాజేంద్రప్రసాద్ ..ఇటివల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ 2018-19 ఏడాదికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టిన సంగతి తెల్సిందే.
బీజేపీ సర్కారు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ మీద ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు విమర్శల పర్వం కురిపిస్తున్నారు.ఇటు ఏపీలో అటు కేంద్రంలో తమకు మిత్రపక్షమైన బీజేపీ పార్టీపై టీడీపీ నేతలు కూడా విమర్శలు కురిపిస్తున్నారు.ఈ క్రమంలో టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ మాట్లాడుతూ చంద్రబాబు అంటే అసలు మోదీకి భయం లేదు .
బాబు తలచుకుంటే కేంద్రంలో చక్రం తిప్పగలడు.తమకు మెజారిటీ ఉందని బీజేపీ పార్టీకి తల పొగరు ఎక్కువైంది అంటూ ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు.తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతల వలనే రాష్ట్రానికి నిధులు రాలేదు అని బీజేపీ పార్టీను వదిలేసి ప్రధాన ప్రతిపక్ష పార్టీ పై నిప్పులు చెరిగారు.ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ 2019లో చంద్రబాబు ప్రధానమంత్రి కాబోతున్నారు ..వెంకయ్య నాయుడు గారు రాష్ట్రపతి కాబోతున్నారు.గర్వంగా చెప్పుకోండి అని ఆయన మీడియా సాక్షిగా అన్నారు ..
వీకెండ్ కామిడి ☺☺☺
Posted by Sarat Kumar Dasari on Saturday, 3 February 2018