2014 ఎన్నికల్లో జస్ట్ చిన్న మార్జిన్‌తో అధికారం కోల్పోయిన వైసీపీ, 2019 ఎన్నికల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకునేలా కన్పిస్తోంది. టీడీపీ జరిపిస్తున్న సర్వేలు, వైసీపీ ఇంటర్నల్ సర్వేలు, సాధారణ సర్వేలూ అన్నీ వైసీపీకి అనుకూలంగానే తీర్పులిస్తున్నాయి. ఇటీవల జాతీయ స్థాయిలో జరిగిన ఓ సర్వే ప్రకారం కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 15కి పైగా పార్లమెంటు సీట్లు దక్కుతాయని తేలింది. దానికి కొనసాగింపుగా ఈ మధ్య వచ్చిన సర్వేలన్నీ జగన్ వైపే మొగ్గు చూపుతున్నాయి. దీంతో ఈసారి గట్టిగా కొడుతున్నాం, ఖచ్చితంగా కొట్టేస్తున్నాం అని వైసీపీ అధినేత జగన్, పార్టీ శ్రేణులకు సంకేతాలు ఇవ్వగలుగుతున్నారు. అధినేత నుంచి ఇంతటి పాజిటివ్ సంకేతాలతో, వైసీపీ శ్రేణులు ఎనలేని ఉత్సాహాం కనిపిస్తోంది.
ఇక ఏపీ అధికార టీడీపీ ఇమేజ్ రోజురోజుకీ పడిపోతుండడంతో, మళ్ళీ పుంజుకునే అవకాశం ఇవ్వకూడదని.. గ్రామ స్థాయి నుంచీ పార్టీ శ్రేణులు యాక్టివ్‌గా ఉండాలని జగన్ పార్టీ ముఖ్య నేతలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలియవస్తోంది. మూడున్నరేళ్ళలో అధికార పార్టీ, రాష్ట్రానికీ ఏమీ చేయని వైనాన్ని ఇంకా బాగా ఎక్స్‌పోజ్ చేయనున్నారు వైసీపీ నేతలు. ఎన్నికలకు దూరంగా ఉండే పార్టీకి చెందిన నేతలు, వ్యూహాల రచనలో నిమగ్నమవ్వాలనీ, టిక్కెట్ ఆశిస్తున్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రౌండ్ లెవల్లో పరిస్థితుల్ని అంచనా వేస్తూ, జనానికి చేరువ కావాలని జగన్ పిలుపునిచ్చినట్లు తెలియవస్తోంది. 15 ఎంపీ సీట్లకు పైగానే రావడమంటే, 100 అసెంబ్లీ స్థానాలు ఆల్రెడీ మన ఖాతాలో ఉన్నట్లేనని రాజకీయ విశ్లేషుకు కూడా అంచనా వేస్తున్నారు.