కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ గురించి ప్రస్తావనే లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో వెనుకడుగు వేశారని ఆయన చెప్పారు. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై విజయసాయి రెడ్డి స్పందిస్తూ.. విశాఖ రైల్వే జోన్ విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని చెప్పారు. రైల్వే జోన్ ఏర్పాటు చేయకుండా… అది లాభదాయకం కాదంటూ తప్పించుకుంటున్నారని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై ఆసక్తి ప్రదర్శించకపోవడం బాధాకరమన్నారు.
see also..లగడపాటి లేటెస్ట్ సర్వే… బీకాంలో ఫిజిక్స్ మొత్తం జాతకం.. పడేది ఎన్నిఓట్లంటే…!
అలాగే పునర్విభజన చట్టంలో షెడ్యూల్ 13లో 11 కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అయితే ఇంతవరకు రెండు కూడా ఏర్పాటు చేయలేదని ఆయన అన్నారు. ఇప్పటి వరకు ఇచ్చిన నివేదిక ప్రకారం 9 కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేయాలంటే… రూ. 11,267 కోట్లు నిధులు అవసరం అవుతాయని అన్నారు. గత నాలుగేళ్లలో జరిగిన కేటాయింపులు చూస్తే 421 కోట్లు మాత్రమే ఇచ్చారని విజయ సాయి వివరించారు.