ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల తరువాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఏంటి ఇంత కచ్చితంగా ఎలా చెప్పగలుగుతారు..? అని అనుకుంటున్నారా..!!
మీ సందేహాలకు సాక్షాధారాలే ఈ కథనం. ఒక్కసారి 2014 లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పట్నుంచి చంద్రబాబు సర్కార్ పనితీరును, అలాగే రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తే మీరూ అవుననే అంటారు.
2014 ఎన్నికల్లో చంద్రబాబు సర్కార్ మోసపూరిత వాగ్ధానాలతో ప్రజలను నమ్మించి నట్టేట ముంచిన మాట జగమెరిగిన సత్యం. రుణాల మాఫీ, ప్రతీ ఇంటికో ఉద్యోగం, అలాగే, కేంద్రం బాధ్యతను (పోలవరం ప్రాజెక్టు నిర్మాణం) తమ నెత్తినేసుకుని పైసలు అందిన కాడికి దండుకోవడం, అలాగే, మహిళలపై టీడీపీ నేతల నుంచి సామాన్య కార్యకర్త వరకు అరాచకాలు, కాల్ మనీ, సెక్స్‌రాకెట్, ప్రభుత్వ అధికారులపై టీడీపీ ఎమ్మెల్యేల దాడులు. రాజధాని నిర్మాణం కోసమంటూ సామాన్య ప్రజల నుంచి భూములు లాక్కోవడం, ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు సర్కార్ వైఫల్యాలు కో కొల్లలు.
నాడు చిరంజీవి..
మరో వైపు చంద్రబాబు కుఠిల రాజకీయాలను పరిశీలిస్తే.. నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో చంద్రబాబు పన్నిన కుట్రలు మరే నాయకుడు పన్నలేదనే చెప్పుకోవచ్చు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు సినీ గ్లామర్ ఉన్న చిరంజీవిని ఎన్నికల్లో పోటీ చేసేలా ప్రోత్సహించి మరీ తన పచ్చ మీడియా ద్వారా ప్రచారం కూడా చేయించారు. ఎలాగో చంద్రబాబు ఓటు బ్యాంకు చంద్రబాబుకే.. మరి కాంగ్రెస్ ఓటు బ్యాంకునైనా చీలుద్దామనే కుట్రతో చంద్రబాబు చిరంజీవిని ప్రోత్సహించిన విషయం తలిసిందే. ఎంత సినీ గ్లామర్ వచ్చినా.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మళ్లీ అధికారంలోకి రాకుండా అడ్డుకోలేక పోయారు చంద్రబాబునాయుడు.
నేడు పవన్ కల్యాణ్..
మరి ఇప్పుడేమో పవన్ కల్యాణ్ పోటీ చేసేలా చంద్రబాబు సర్కార్ ప్రోత్సహిస్తోంది. అయినా సరే.. నాడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్న చిరంజీవి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముందు సాగిలపడ్డట్టు.. నేడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సాగిలపడక తప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.