గత నాలుగు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న టీడీపీ చేస్తున్న పాలన ఎలా ఉందో దేశానికే తెలిసిందని , రాక్షస పాలన జరుగుతుందని వైసీపీ నేతలు ఏన్నో సార్లు మీడియా ముందు చెప్పారు. ఇలాంటి పాలన ఉండకూడదని జగన్ పాదయాత్ర చేస్తున్నాడు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో త్వరలో మరో సంచలనానికి తెరలేవనుంది. అతి తొందరలోనే ప్రధానమంత్రి నరేంద్రమోది -ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మధ్య భేటీ జరిగే అవకాశాలున్నట్లు సమాచారం. ఢిల్లీలో జగన్ తరపున కీలకంగా వ్యవహరిస్తున్న ఓ ఎంపి ప్రధాని అపాయిట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారట. అవకాశం దొరికితే పాదయాత్ర మధ్యలోనే మోడిని జగన్ కలిసే అవకాశాలున్నాయి.
see also..బ్రేకింగ్ : 2019లో అధికారం ఎవ్వరిదో చెప్పిన లగడపాటి లేటెస్ట్ సర్వే..!
ఎప్పుడైతే ప్రధాని అపాయిట్మెంట్ కోసం ఓ ఎంపి ప్రయత్నిస్తున్నారని తెలిసిందో టీడీపీ నేతల్లో ఆందోళన మొదలైంది. ఎటుతిరిగి బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయ. కాబట్టి కేంద్రమంత్రులకు, ఎంపిలకు ప్రధాని దాదాపు అందుబాటులోనే ఉంటారు. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మోడి-జగన్ భేటీకి రంగం సిద్ధం చేయాలని సదరు ఎంపి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. ఈ నేపధ్యంలోనే జగన్ ప్రధాని అపాయిట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారన్న విషయం సంచలనంగా మారింది.