ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నిన్న( బుధవారం ) ప్రారంభమైన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఈ జాతర రెండేన్లు కొక్కసారి రావడంతో భక్తులు భారీ గా తరలి వస్తున్నారు.నిన్నటి వరకు సుమారు 50లక్షల వరకు దర్శించునున్నారని సమాచారం.కాగా ఈ జాతరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది.ఈ నేపధ్యంలో రేపు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు,తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు.ఈ నేపధ్యంలో గద్దెల ప్రాంగణం సమీపంలో తాత్కాలిక హెలిప్యాడ్‌లు నిర్మిస్తున్నారు. ఈ సందర్బంగా ఉపరాష్ట్రపతికి ఘన స్వాగతం పలుకడంతోపాటు అపురూపమైన కానుకను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
see also : 2019 లో ముఖ్యమంత్రి కానున్న వైఎస్ జగన్..! ఇవిగో సాక్ష్యాలు.!!
మేడారం జాతర సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టేలా హైదరాబాద్‌లో రూపొందించిన కానుకలను ఉప రాష్ట్రపతికి అందజేయనున్నారు.మేడారం జాతరలో ఆదివాసీ, గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలన్నీ ఎరుపు రంగులోనే కనిపిస్తుంటాయి. వారు ఉపయోగించే సారెతోపాటు వారి వస్ర్తాలంకరణ తదితరాలన్నీ ఎరుపుతోనే మొదలవుతాయి. వారి విశిష్టతలకు ప్రాధాన్యం కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ఎరుపు రంగులో ఆకట్టుకునేలా కానుకల బాక్సును రూపొందించింది.మేడారం జాతరకు ఈసారి కేంద్ర మంత్రులు, పలు రాష్ర్టాలకు చెందిన ముఖ్యులు రానున్న నేపథ్యంలో వారందరికీ ఈ ప్రత్యేక కానుకలను అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు హైదారాబాద్ నుంచి ప్రత్యేక వాహనంలో 50కి పైగా ప్రత్యేక కానుకలను మేడారానికి తెప్పించారు. కాగా ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ మేడారం జాతరకు రానున్న విషయం తెలిసిందే.
see also : బ్రేకింగ్ : 2019లో అధికారం ఎవ్వరిదో చెప్పిన లగడపాటి లేటెస్ట్ సర్వే..!
see also :2019లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకపోతేరాజకీయ సన్యాసం తీసుకుంటా..కేటీఆర్