గత నాలుగు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న టీడీపీ చేస్తున్న పాలన నచ్చక వైసీపీలోకి వలసలు పెరుగుతున్నాయి. ఇటీవల కలెక్షన్ కింగ్ మోహాన్ బాబు రాజకీయ నేతలందరిలో 95% రాస్కెల్స్ వున్నారంటూ ఇండియా టుడే కాన్ క్లేవ్ లో సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే గతంలో రాజకీయాల్లో మోహన్ బాబు చురుకైన పాత్ర పోషించారు. రాజ్య సభ సభ్యునిగానూ పదవిలో కొనసాగారు మోహన్ బాబు. రాజకీయ పరంగా మోహన్ బాబుకు ఆసక్తి కనిపించకున్నా… ఆయన కుటుంబంలోంచి రాజకీయ వారసత్వం కోసం మంచు లక్ష్మి రెడీ అవుతోందని తెలుస్తోంది. తెలుగు ప్రేక్షకులల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన మంచు లక్ష్మి పలు సమాజిక సేవా కార్యక్రమాలతోనూ, టీవీ షోలతోనూ, సినిమాలతోనూ.. ఇలా పలు రంగాల్లో తనదైన ప్రత్యేకతను చాటుకుంటూ తనకంటూ ఓ క్లీన్ ఇమేజ్ తో పాటు ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. మంచు ఫ్యామిలీలో విష్ణు, మనోజ్ లు వున్నా…క్రేజ్ పరంగా మంచు లక్ష్మికే ఎక్కువ మార్కులు పడతాయి. అందుకే మంచు ఫ్యామిలీ నుంచి రాజకీయాలవైపు చూస్తున్నట్లుగా మంచు లక్ష్మి పేరు వినపడుతోంది.
see also..బ్రేకింగ్ : 2019లో అధికారం ఎవ్వరిదో చెప్పిన లగడపాటి లేటెస్ట్ సర్వే..!
మంచు లక్ష్మి కడప జిల్లా రాజంపేట నుంచి వచ్చే ఎన్నికల్లో లోక్ సభ స్థానానికి పోటీ చేస్తారని సమాచారం. రాయలసీమ అంటే ప్రత్యేకమైన అభిమానం వున్న మోహన్ బాబు ఫ్యామిలీ గతంలో శ్రీ రాములయ్య, రాయలసీమ రామన్న చౌదరి లాంటి సినిమాలతో రాయలసీమ జనానికి దగ్గరయ్యారు. అందుకే రాయలసీమ జిల్లా కడపలోని రాజంపేట లోక్ సభ స్థానం నుంచి మంచు లక్ష్మి పోటీకి రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మమోహన్ బాబు ఫ్యామిలీకి వైఎస్ జగన్ కుటుంబంతో బంధుత్వం కూడా వున్న సంగతి తెలిసిందే. అన్ని కుదిరితే ఆమె వైసీపీ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి