తెలుగు సినీ వర్గీయుల్లో ఓ వార్త హాట్ టాపిక్ అయ్యింది. టాలీవుడ్‌లో స్టార్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్… అదే టాలీవుడ్ దిల్లున్న హీరో నితిన్ రెడ్డి భార్య కాబోతోందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అసలు మ్యాటర్ ఏంటంటే దిల్ రాజు మరో మల్లీస్టారర్ సినిమాకు పచ్చజెండా ఊపారు. హీరోలు నితిన్, శర్వానంద్ తో సినిమా తీస్తున్నారు. గబ్బర్ సింగ్, డీజే సినిమాలు తీసిన దర్శకుడు హరీష్ శంకర్ ఈ మల్టీస్టారర్ మూవీకి దర్శకుడు. కథ నచ్చడంతో నితిన్, శర్వానంద్ ఒప్పుకున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మేలో ఈ చిత్రం షూటింగ్ మొదలు కాబోతోంది..
దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీలో నితిన్ భార్యగా రకుల్ ప్రీత్ సింగ్ నటించబోతోందని సమాచారం. సినిమాలో గృహిణి పాత్రలో నటించడానికి అగ్ర హీరోయిన్ అయ్యిండి రకుల్ అభ్యంతరం పెట్టలేదట.. దీంతో స్టార్ హీరోయిన్ ఓ ఇల్లాలి పాత్రలో ఎలా నటించబోతుందనే వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న రకుల్.. టాలీవుడ్ అగ్రహీరోలందరితోనూ నటించేసింది. మెగా హీరోలందరితోనూ ఆడిపాడి వారి ఆస్థాన హీరోయిన్ అన్న పేరు సంపాదించుకుంది.. ఇంత క్రేజ్ ఉన్న హీరోయిన్ అర్ధాంతరంగా వివాహితగా మారబోతోందని.. నితిన్‌కు భార్య కాబోతోందని వార్తలు రావడంతో… ఇంతకాలం రానాని వాడుకొని పెళ్లి మాత్రం నితిన్‌ని చేసుకుంటావా అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తూ పోస్టులు పెడుతున్నారు.