2018-19 ఏడాదికి సంబంధించి కేంద్ర బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ రోజు గురువారం లోక్ సభలో ప్రవేశపెట్టారు.కేంద్ర మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రధాన మంత్రి నరేందర్ మోదీ ప్రశంసల వర్షం కురిపించారు .ఆయన మాట్లాడుతూ ఈ రోజు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ రైతు హిత బడ్జెట్ అని ఆయన అన్నారు .రైతులకు ,సాధారణ పౌరులకు ,వ్యాపారవేత్తలకు ఈ బడ్జెట్ అనుకూలంగా ఉందని అన్నారు .కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ తో జీవిన విధానం మరింత సరళంగా మారుతుంది .రైతులు ,దళితులు ,గిరిజన తదితర వర్గాలు లబ్ది పొందుతారు అని అన్నారు .గ్రామీణ భారతానికి ఈ బడ్జెట్ ద్వారా సరికొత్త అవకాశాలు వస్తాయి .అన్ని తరహ పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని తీసుకున్న నిర్ణయం పట్ల కేంద్ర ఆర్థిక మంత్రిపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు .
see also :2018 బడ్జెట్ లో ఏపీకి బిగ్ షాకిచ్చిన కేంద్ర సర్కారు..!