టాలీవుడ్ వర్గీయుల్లోనే కాకుండా సోషల్ మీడియాలో మెగా డాటర్ నిహారిక పెళ్లి పై రచ్చ జరుగుతోంది. అసుల మ్యాటర్ ఏంటంటే.. నిహారిక-హీరో నాగశౌర్యతో ప్రేమలో ఉందని.. ఇద్దరి పెళ్లికి మెగా ఫ్యామిలీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అయితే నాగబాబు మాత్రం ఒప్పుకోవడం లేదని మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడైన వ్యక్తి నుండి ఈ మ్యాటర్ లీక్ అయ్యిందని వారం రోజులుగా ఓ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
అయితే ఈ వార్తలో నిజమెంత ఉందనేది తెలియదు గానీ మరో వార్త ఒకటి సోషల్ మీడియాలోకి వచ్చేసింది. నాగశౌర్య, నిహారిక కలిసి ఒక్కమనసు చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఆ హిట్ కాకపోయినా వీరిద్దరి మనసులు ఒక్కటయ్యాయని దీంతో నిహారిక తన కుటుంబీకులకు చెప్పగా మెగా ఫ్యామిలి చర్చించుకొని పాజిటీవ్‌గా రెస్పాండ్ అయ్యారని.. ఈ నేపధ్యంలోనే నాగ శౌర్య నటించిన ఛలో మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు వచ్చి తెగ పొగిడేశారని సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే చిరంజీవి ఒప్పుకున్నా.. నాగబాబు ఒప్పుకోక పోవడంతో అన్నదమ్ములు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందట.. నాగబాబు కొంచె ఆవేశంగా నీకూతుర్ల విషయంలో ఒకలాగా.. నా కూతురు విషయంలో మరోలా నిర్ణయాలు వద్ద.. నా కూతురుకు ఎవరితో పెళ్లి చేయాలో నాకు తెలుసు ఈ విషయం నీ జోక్యం వద్దు అంటూ సీరియస్‌గా వెళ్ళిపోయాడని.. నాగబాబు మాటలకి చిరంజీవి కూడా షాక్ తిన్నాడని.. ఈ మ్యాటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.