ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబును రాజకీయ సర్వేల్లో బాగా పేరుగాంచిన సీనియర్ నేత లగపాటి రాజగోపాల్ నేరుగా అమరావతికి వచ్చి.. బాబును కలిసి దాదాపు అరగంటకు పైగా చర్చలు నిర్వహించి వెళ్లారు. బాబుతో లగడపాటి ఇటీవల కాలంలో రెండుమూడు సార్లు భేటీ అయ్యారు. అయితే, ఆ చర్చలేవీ రాజకీయాలకు సంబంధించినవి కావని రాజగోపాల్ చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇక అసలు మ్యాటర్ ఏంటంటే.. ఎప్పటికప్పుడు ఏపీ రాజకీయ పరిస్థితులు సహా దేశవ్యాప్తంగా రాజకీయాల పై ఆయన లగడపాటి పేరుతో సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వే ఫలితాలు, వాస్తవ ఫలితాలకు అత్యంత దగ్గరగా ఉండడం గమనార్హం. దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిని రేకెత్తించిన నంద్యాల ఉప ఎన్నిక ఫలితం లగడపాటి చెప్పినట్టే రాగా ఆ తర్వాత జరిగిన కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు కూడా అలాగే రావడంతో ఆర్జీ సర్వేకి క్రేజ్ పెరిగింది
ఇక నంద్యాల ఉప ఎన్నిక విషయంలో ఆర్జీ ఇచ్చిన రిపోర్ట్ అప్పట్లో సంచలనం సృష్టించింది. అధికార టీడీపీకి అనుకూలంగా ఆయన ఇచ్చిన సర్వే రిజల్ట్.. తర్వాత వచ్చిన వాస్తవ ఎన్నికల ఫలితాలకు దగ్గరగా ఉండడంతో చంద్రబాబుతో లగడపాటికి సాన్నిహిత్యం పెరిగింది. ఈ నేపధ్యంలోనే తాజాగా ఏపీ మొత్తం మరోసారి లగడపాటితో సర్వే చేయించారు. తీరా రిజల్ట్ చూసాక చంద్రబాబు మైండ్ బ్లాక్ అయ్యింది. దీంతో టీడీపీకి వ్యతిరేకంగా రిజల్ట్ వచ్చినా ఆ సర్వే రిపోర్ట్ బయటకి ఎందుకు లీక్ చేశారని చంద్రబాబు లగడపాటి పై ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం.. ఏది ఏమైనా ఈ సర్వే రిపోర్ట్ పూర్తిగా బయటకి పొక్కడంతో టీడీపీ బ్యాచ్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.