ఏపీలోని విజయవాడలో ఉన్న మూడు నియోజకవర్గాల్లోనూ అత్యంత కీలకమైన నియోజకవర్గం పశ్చిమం. అత్యంత కీలకమైన ఈ నియోజకవర్గంలో 2014లో వైసీపీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యే జనాబ్ జలీల్ ఖాన్.. చంద్రబాబు ఆకర్ష్ మంత్రానికి ఫిదా అయిపోయారు. దీంతో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే పార్టీ మారిన జలీల్‌ఖాన్ ఆయన ముస్లిం సామాజిక వర్గం నుంచి బాబు కేబినెట్లో మంత్రిగా ఎవరూ లేకపోవడంతో తనకు గ్యారెంటీగా మంత్రి పదవి దక్కడం ఖాయమని ఆశలు పెట్టుకున్నారు.
See Also : 2018-19 కేంద్ర బడ్జెట్ : ముఖ్యాంశాలు ఇవే..!
కట్ చేస్తే అనూహ్యంగా ఆయన బీకాంలో ఫిజిక్స్ ఉందంటూ తన అజ్ఞానాన్ని బయట పెట్టుకోవడంతో జలీల్ మంత్రి ఆశల పై బాబు నీళ్లు జల్లారు. ఇక అప్పటి నుంచి ఆయన అన్యమనస్కంగానే నియోజకవర్గంలో తిరుగుతున్నారు.వాస్తవానికి తొలుత కాంగ్రెస్ తర్వాత వైసీపీలో పనిచేసిన జలీల్‌కు టీడీపీ నేతలతో ఎప్పుడూ వివాదాలే నడిచాయి. దీంతో ఇప్పుడు ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా కండువా మార్చుకున్నా.. ఎవరూ ఆయనతో కలిసి నడిచేందుకు టీడీపీ నుంచి ముందుకు రావడం లేదు. టీడీపీ తరఫున ఇక్కడ క్రియాశీలంగా వ్యవహరించిన నాగుల్ మీరాను చంద్రబాబు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా నామినేట్ చేశారు. దీంతో చిరకాలంగా వీరి మధ్య ఉన్న విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇక తాజాగా వచ్చిన లగడపాటి సర్వేలో కూడా జలీల్ ఖాన్‌కు చుక్కెదురే అని తేలింది. వైసీపీ జెండా పై గెలిచి.. టీడీపీలోకి జంప్ అయిన బ్యాచ్‌లో బీకాంలో ఫిజిక్స్ వ్యాఖ్య వల్ల బాగా ఫేమస్ అయ్యింది జలీల్ ఖానే అయినా వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని లగడపాటి సర్వే తేల్చేసింది.
see also : టీవీ నటి వ్యభిచారం..మఫ్టీలో వెళ్లిన పోలీసులకు
see also : వైసీపీలోకి లగడపాటి రాజ్‌గోపాల్..! డేట్ ఫిక్స్..!!
see also :2018 బడ్జెట్ లో ఏపీకి బిగ్ షాకిచ్చిన కేంద్ర సర్కారు..!