వైసీపీలోకి లగడపాటి రాజ్‌గోపాల్..! డేట్ ఫిక్స్..!!… లడపాటి రాజగోపాల్ వైసీపీలో చేరనున్నారా..? అందుకు ముహూర్తం కూడా ఖరారైందా..? అన్న ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అందుకు కారణాలు కూడా లేకపోలేదు మరీ. ఆ కారణాలను ఒకసారి పరిశీలిస్తే రాజకీయ విశ్లేషకుల మాట వాస్తవమనే చెప్పొచ్చు.
see also : కాంగ్రెస్ నేతలకు నిద్ర లేకుండా చేసిన 41ఏళ్ళ యువనేత …
ఇక అసలు విషయానికొస్తే.. ఇటు రాష్ట్రంలోను.. అటు దేశంలోనూ ఎన్ని సర్వే ఏజెన్సీలు ఉన్నా మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వేవైపే ప్రజలు విశ్వసనీయత చూపుతారని చెప్పొచ్చు. అంతలా నిక్కచ్చిగా ఉంటాయి లగడపాటి రాజగోపాల్ సర్వేలు. అంతేకాకుండా లగడపాటి చెప్పిన సర్వేలు చాలా వరకు నిజమయ్యాయి కూడాను. అంతేకాకుండా లగడపాటి రాజగోపాల్ రాష్ట్ర విభజనకు ముందు రెండు దఫాలుగా ఎంపీగా గెలిచారు. పార్లమెంటులో ఆయనది ఓ ప్రత్యేక స్థానం అని చెప్పుకోక తప్పదు. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన 2014 సాధారణ ఎన్నికల్లో రాజగోపాల్ పోటీ చేయలేదు. కొంతకాలంగా క్రియాశీల రాజకీయాలకు రాజగోపాల్ దూరంగా ఉన్నారని చెప్పుకోవచ్చు.
see also :ఐపిల్ హాట్ టాపిక్.. జూదూ చేసిన జాన్వీ పై కన్నేసిన బడా బాబులు..!
అయితే, ఏపీలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో లగడపాటి రాజగోపాల్ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుచూపుతున్నారని సమాచారం. అసలే ఏపీలో ఎన్నికల వాతావరణం ఇప్పటికే వేడెక్కింది. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల నాటికి జగన్ సమక్షంలో వైసీపీలో చేరి విజయవాడ నుంచి లోక్ సభ స్థానానికి పోటీ చేయాలని నిశ్చయించుకున్నారట. ఇప్పటికే విజయవాడ నుంచి టీడీపీ టిక్కెట్‌పై మళ్లీ పోటీ చేసేందుకు ఎంపీ కేశినేని నాని సిద్దంగా ఉన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా లగడపాటి రాజగోపాల్‌రెడ్డి వైసీపీలోకి వస్తే ఆహ్వానించడం ఖాయం. ఇటీవల కాలంలో వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్రపై రాజగోపాల్ ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.
మరోవైపు వైసీపీ గ్రామ స్థాయిలో బలం పుంజుకున్న విషయం తెలిసిందే. తాజా సర్వేల్లోనూ వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికే అనుకూలంగా ఫలితాలు వచ్చిన విషయం తెలిసిందే. ఏకంగా అటు మోడీ, ఇటు చంద్రబాబుల అనుకూల మీడియా దిగ్గజాలు నిర్వహించిన సర్వేలోనూ 2019లో జగన్‌కే సీఎం పీఠం అన్న విషయం వెల్లడైంది. ఇప్పటికే టీడీపీ కార్యకర్తల, నాయకుల వ్యవహార శైలితో గ్రామస్థాయిలో పటిష్టతను కోల్పోయిందన్నది జగమెరిగిన సత్యం. ఈ నేపథ్యంలో లగడపాటి సర్వేలోనూ జగనే సీఎం అని తేలడంతో… లగడపాటి రాజగోపాల్ వైసీపీలో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
see also : మానవత్వం చాటుకున్న హోంగార్డులు..మంత్రి కేటీఆర్ అభినందనలు
see also : త్వరలో మరో సంచలనం..మోడితో-జగన్ భేటీ ..టీడీపీ నేతల్లో ఆందోళన