Home / NATIONAL / కాంగ్రెస్ నేతలకు నిద్ర లేకుండా చేసిన 41ఏళ్ళ యువనేత …

కాంగ్రెస్ నేతలకు నిద్ర లేకుండా చేసిన 41ఏళ్ళ యువనేత …

కాంగ్రెస్ పార్టీ వందేళ్ళకు పైగా చరిత్ర ఉన్న జాతీయ పార్టీ.స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇటు రాష్ట్రాలను కానీ అటు దేశాన్ని అత్యధిక కాలం పాలించిన ఏకైక రాజకీయ పార్టీ.అట్లాంటి ఘనచరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ రాష్ట్ర నేతలకు నిద్ర లేకుండా చేశాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తనయుడు ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీరామారావు.మంత్రి కేటీఆర్ బుధవారం ఉమ్మడి పాలమూరు జిల్లా గద్వాల్ లో పర్యటించారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు
శంఖుస్థాపన చేశారు.అనంతరం జరిగిన భారీ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను చూసి కాంగ్రేసోల్లకు నిద్ర పట్టడంలేదు.

నీళ్ళు ఇస్తుంటే మంట.అన్ని వర్గాల వారికీ అభివృద్ధి ఫలాలు చేరుతుంటే మంట.ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి వీస్తుంది.ఏకంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సొంత నియోజకవర్గంలోనే మున్సిపాలిటీలో ఘోర పరాజయం పాలైంది.తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలకు ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో డెబ్బై స్థానాలు వస్తాయని జబ్బలు చరుచుకుంటున్న పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకపోతే ..ఒకవేళ కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే నాకు నలబై ఒక్క ఏళ్ళు .నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా ..మీరు ఓడిపోతే మీరు తీసుకుంటారా అని సవాలు విసిరారు మంత్రి కేటీఆర్ .

 గతంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తాను .మీరు ఓడిపోతే పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారా అని సవాలు విసిరారు .దీనికి సమాధానంగా ఉత్తమ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సవాలు చేస్తే స్వీకరిస్తాను అని చెప్పిన సంగతి తెల్సిందే.అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కనీసం సింగల్ డిజిట్ కూడా దాటలేదని మనకు తెల్సిందే.అయితే మంత్రి కేటీఆర్ చేసిన సవాలుతో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలకు నిద్ర కరువైంది అని ఆ పార్టీ నేతలే స్వయంగా వాపోతున్నారు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat