కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి అన్యాయం జరిగిందని తెలుగుదేశం పార్టీని పొమ్మనలేక పొగ పెడుతున్నట్లుగా కేంద్రం వ్యవహరించిందని అనంతపురం ఎమ్.పి ,టిడిపి నేత జెసి దివాకరరడ్డి వ్యాఖ్యానించారు. 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై పలువురు ఎమ్.పిలు కేంద్రం తీరుపై అసంతృఫ్తి వ్యక్తం చేసిన నేపద్యంలో జెసి మరింత ఘాటుగా మాట్లాడారు. విబజన హామీలలో కేంద్రం తీరు సరిగా లేదని ఆయన అన్నారు. పపార్లమెంటు సాక్షిగా విభజన హామీలను కేంద్రం ఎగవేసిందని ఆయన అన్నారు. రైల్వే జోన్ ఇస్తామని పార్లమెంటులో హామీ ఇచ్చారని, అయినా ఇప్పుడు దాని గురించే చెప్పలేదని ఆయన అన్నారు. విభజన హామీలపై చెప్పులు అరిగేలా తిరిగామని అయినా పలితం దక్కలేదని, ఇదంతా చూస్తుంటే పొమ్మనలేక పొగబెట్టినట్లు ఉందని జెసి దివాకరరెడ్డి అన్నారు.
see also..లగడపాటి లేటెస్ట్ సర్వే… బీకాంలో ఫిజిక్స్ మొత్తం జాతకం.. పడేది ఎన్నిఓట్లంటే…!