వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర నెల్లూరు జిల్లాలో జోరుగా సాగుతోంది. పాదయాత్రలో భాగంగా ఓ ఆశక్తికర సంఘటన జరింగింది. జగన్ పాదయాత్రలో భాగంగా నిర్వహిస్తున్న చిన్న చిన్న సభల్లో అక్కడ గ్రామాల్లో వారికి ఎదురవుతున్న పరిస్థితులు.. అలాగు కొన్ని సమస్యలు గురించి పజలు డైరెక్ట్‌గా చర్చిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా జరిగిన సభలో ఒక మహిళ మైక్ తీసుకొని మాట్లాడిన మాటలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
నెల్లూరు వెంకటగిరికి చెందిన పద్మ అనే మహిళ మాట్లాడుతూ.. జగన్ అన్నా మీరు హామీ ఇచ్చిన పథకాలు అన్నీ చాలా బాగ ఉన్నాయి. అయితే టీడీపీ వర్గీయులు నవ్వుతున్నారన్న.. నాకు సెంటర్ చిన్న షాపు ఉంది.. అక్కడికి ఆ టీడీపీ వాళ్లు వచ్చి 45 ఏళ్లకే పించను ఇచ్చేస్తాడా మీ జగనన్న.. నిజమేనా.. అది జరిగేపనేనా అంటూ హేళి చేస్తున్నారు. దానికి సమాధానంగా నేను ఒకటే వారికి ఒకటే చెప్పాను.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్షాలు వచ్చినప్పుడు మొగ్గాల గుంటలో నీళ్లు వచ్చినప్పుడు బస్తా బియ్యం 2000 రూపాయిలు డబ్బులు ఇస్తానని ప్రకటించి ఇచ్చి చూపించాడు. అది రాజన్నలో ఉన్న పవర్.. నాకు తెల్సు ఆ సంగతి.. నన్ను పద్మా అని ఆప్యాయగా పిలిచిన మహోన్నత వ్యక్తి రాజశేఖర్ రెడ్డిగారు. జగనన్న మీరు అధికారంలోకి వచ్చాక మా చేనేత కార్మికులకి ఉచితంగా కరెంటు ఇవ్వాలని.. కరెంటు బిల్లు ఎక్కువగా వస్తోందని.. అవి మేము కట్టలేక పోతున్నామని.. మా పిల్లలను కూడా చదివించుకోలేని పరిస్థితుల్లో ఉన్నామన్నా… అన్నా ఎవరు నమ్మినా నమ్మకపోయినా మీరు ప్రకటించిన హామీల పై మాకు నమ్మకం ఉందని ఆమె చెప్పడంతో సభమొత్తం మోత మోగిపోయింది.