ఈ మద్య సినిమా వాళ్లకు లైంగిక వేదింపులు తప్పడం లేదు. డ్యాన్స్ స్కూల్ నడుపుతున్న మాస్టర్ అళగేశన్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ.. చెన్నై మాంబలం పోలీస్‌స్టేషన్‌లో నటి అమలాపాల్ బుధవారం ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు గంట వ్యవధిలోనే నిందితుడు అళగేశన్‌ను అరెస్టు చేశారు. ఆయనపై 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ విషయమై అమలాపాల్ మాట్లాడుతూ.. మలేసియాలో మహిళాభివృద్ధికి సంబంధించి ‘డాన్సింగ్ తమిళచ్చి’ కార్యక్రమంలో పాల్గొనే క్రమంలో టీ నగర్‌లోని నృత్య పాఠశాలలో 3 రోజులుగా శిక్షణ పొందుతున్నానని, అక్కడ అళగేశన్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై పూర్తి వివిరాలు తెలియాల్సివుంది.
see also..త్వరలో మరో సంచలనం..మోడితో-జగన్ భేటీ ..టీడీపీ నేతల్లో ఆందోళన