2018-19 ఏడాదికి సంబంధించి కేంద్ర బడ్జెట్ ను ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే..ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు పలు కేటాయింపులు చేశారు.ఆ వివరాలు మీ కోసం..
ఆంధ్రప్రదేశ్‌లో
- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీకి రూ.32కోట్లు,
- కేంద్రీయ విశ్వవిద్యాలయానికి రూ.10కోట్లు,
- గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.10కోట్లు,
- ఎన్‌ఐటీకి రూ.54కోట్లు,
- ఐఐటీకి రూ.50కోట్లు,
- ట్రిపుల్ ఐటీకి రూ.30 కోట్లు,
- ఐఐఎంకు రూ.42 కోట్లు,
- ఐఐఎస్‌సీఆర్‌కు రూ.49కోట్లు,
- విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.1,400 కోట్లు,
- విశాఖ పోర్టుకు రూ.108 కోట్లు,
- డ్రెడ్జింగ్ కార్పోరేషన్‌కు రూ.19.62కోట్లు ఇచ్చారు. అలాగే, పరిశ్రమలలకు వడ్డీ రాయితీ కోసం రూ.50 కోట్లు కేటాయించారు.
తెలంగాణ రాష్ట్రం కు
- పరిశ్రమలలకు వడ్డీ రాయితీ కోసం రూ.50 కోట్లు,
- నల్గొండ-లింగంగుంట మార్గంలో 129 కి.మీ. మేర ఎలక్ట్రికేషన్,
- పెద్దపల్లి-లింగంపేట మార్గంలో 83కి.మీ. మేర ఎలక్ట్రికేషన్ కోసం కేటాయించారు.
- హైదరాబాద్ ఐఐటీకి రూ.75 కోట్లు,
- గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.10 కోట్లు, సింగరేణికి రూ.2 వేల కోట్లు కేటాయించారు.