ఏపీలో ప్రజా సమస్యలకోసం వైసీపీ అదినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పాయాత్ర విజయవంతంగా ఆశేశ జనాల మద్య నెల్లూరు జిల్లాలో జరుగుతున్నది. ఈనెల 29 న ప్రపంచ వ్యాప్తంగా వాక్ విత్ జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం ను నిర్వహించారు వైసీపీ నేతలు. అయితే ప్రస్తుతం ఈ కార్యక్రమం బాగా హైలేట్ అయ్యి ప్రజల్లో ఒక నమ్మకం రావడంతో తెలుగు తమ్ముళ్లు జీర్ణంచుకోలేక పోతున్నారని వైసీపీ అభిమానులు అంటున్నారు. ఇక తాజాగా టీడీపీ పార్టీ నాయకురాలు పంచుమర్తి అనురాధ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్‌తో ప్రజలు ఎక్కడికి నడుస్తారు, జైలుకా అని ఆమె అడిగారు. జగన్‌ది పాదయాత్ర కాదని, అది పాడు యాత్ర అని ఆమె వ్యాఖ్యానించారు.
see also..టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు రాజీనామా..!!
జగన్ ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం పాదయాత్ర చేయడం లేదని పంచుమర్తి అనురాధ అన్నారు. తనను ఎవరో వెంటాడుతున్నారని భయపడుతున్నట్లుగా జగన్ పాదయాత్ర సాగుతోందని ఆమె వ్యాఖ్యానించారు. నాయకుల ప్రయోజనాల కోసం జరిగే పాదయాత్ర వల్ల ఫలితాలు ఉండవని అన్నారు. అప్పుడలా చెప్పి ఇప్పుడు పాదయాత్రలో జగన్ చేస్తున్న వాగ్దానాలు అమలు అయ్యేవి కావని అనురాధ అన్నారు. నలబై ఏళ్ల వయస్సు గలవారికి పింఛను ఇస్తానని చెప్పడం మూర్ఖత్వమని అనురాధ అన్నారు. వేయి కిలోమీటర్ల పాదయాత్రలో జగన్ కోర్టుకు వెళ్లడానికి ఎన్ని బ్రేకులు తీసుకున్నాడో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. దాన్ని పాదయాత్ర అని ఎలా అంటారని ఆమె అన్నారు. అయితే ఈ వాఖ్యలపై వైసీపీ అభిమానులు 2019 లో ఓడిపోవడం దాదాపు ఖరారు అయ్యింది…అందుకే టీడీపీ నేతలు ఒక్కొక్కరు వైఎస్ జగన్ పై దుష్పాచారం చెయ్యాలని …ఎలాగైనా అధికారంలోకి రావలని చూస్తున్నారు.