హైదరాబాద్ లో అక్రమ సంబందాలు విపరీతంగా పేరిగిపోతున్నాయి. ఇటివల వివాహేతర సంబంధం కారణంగా సస్పెండ్ అయిన ఏఎస్పీ సునీతారెడ్డి, సీఐ మల్లికార్జునరెడ్డి ఉదంతం మరచి పోకముందే… పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళపై కన్నేసిన ఎస్సై ఆమెను లోబర్చుకున్నాడు. అక్రమ సంబందం కొనసాగిస్తున్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో వెలుగు చూసింది. భర్తపై కేసు పెట్టడానికి వచ్చిన మహిళతో నర్సింహులు అనే ఎస్సై మాట కలిపాడు. ఆమెతో పరిచయం పెంచుకొని చనువుగా ఉండటం మొదలుపెట్టాడు.అంతేకాదు ఎస్సై.. ఆమెతో కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరగడం మొదలుపెట్టాడు.
see also..నెల్లూరులో టీచరమ్మతో యువకుడు సెక్స్ చేసి..వీడియో యూట్యూబ్‌లో
ఇద్దరి మధ్య చనువు పెరిగిపోవడంతో… ఆ విషయం తెలుసుకున్న ఆమె భర్త మందలించాడు. దీంతో విడాకులు ఇవ్వాలని ఆమె భర్త సతీష్‌ను ఎస్సై నర్సింహులు బెదిరించాడు. దీంతో సతీష్ మాల్కాజ్‌గిరి డీసీపీ ఉమా మహేశ్వరరావును ఆశ్రయించాడు. ఎస్సై బెదిరిస్తున్నాడని, ఆయన బారి నుంచి కాపాడాలని కోరాడు. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళను లోబర్చుకొని, విడాకులివ్వాలని ఆమె భర్తను బెదిరించిన ఎస్సైపై పోలీసు ఉన్నతాధికారులు ఆగ్రహంగా ఉన్నారు.