జగన్ పాదయాత్రపై వ్యంగ్యాస్ర్తాలు సంధించారు ఏపీ మంత్రి జవహర్. వాక్ విత్ జగన్ అంటే జైలుకేనని విమర్శించారు. వైఎస్ జగన్ వెయ్యి కిలో మీటర్లు కాదు కదా.. లక్ష కిలోమీటర్లు నడిచినా సీఎం కాలేరన్నారు మంత్రి జవహర్. అంతటితో ఆగక అసలు ప్రజలు వైఎస్ జగన్ వెంట ఎందుకు నడవాలని ప్రశ్నించారు. వైఎస్ జగన్ సీఎం పీఠంకు దగ్గర అవుతున్నానని అనుకుంటూ భ్రమపడుతున్నాడని ఎద్దేవ చేశారు. వైఎస్ జగన్ మోకాళ్ల యాత్ర చేసినా.. పొర్లు దండాలు పెట్టినా, దండయాత్ర చేసినా అధికారం మాత్రం అందని ద్రాక్షేనన్నారు. వైఎస్ విజయమ్మ గత ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు ప్రతీకారంగా హుదూద్ తుఫాన్ రావాలని కోరుకున్న వ్యక్తి వైఎస్ జగన్ అంటూ తీవ్ర విమర్శలు చేశారు మంత్రి జవహర్.
