తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత సీఎస్ ఎస్పీ సింగ్ పదవీకాలం ఇవాళ్టితో ముగియనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శైలేంద్రకుమార్ జోషిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో శైలేంద్రకుమార్ జోషిని సీఎస్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.శైలేంద్ర కుమార్ జోషి 1959 డిసెంబర్ 20న ఉత్తరప్రదేశ్ లోని బరేలిలో జన్మించారు.జోషి 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఢిల్లీ ఐఐటీలో జోషి పోస్టు గ్రాడ్యుయేషన్ చేశారు. శైలేంద్ర కుమార్ జోషి.. ప్రస్తుతం నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నారు.
see also : సీఎం కేసీఆర్ హర్షం..!
see also : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం.. టాప్ గేర్‌లో దుసుకుపోతున్న కారు..!
see also : ఏపీకి గత నాలుగేళ్లుగా ”చంద్రబాబా” గ్రహణమే.. ఈ గ్రహణం మమ్మల్ని ఏం చేయలేదు..!