అవును, మీరు విన్నది నిజమే జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్‌ను ఉప ప్రధానిని చేసినా తప్పులేదట. ఈ మాటలు ఎవరో అన్నవి కాదండి బాబోయ్. స్వయాన కత్తి మహేష్ అన్న మాటలే ఇవి.
ఇంతకీ కత్తి మహేష్ ఏమన్నాడనేగా మీ డౌట్. ఇక అసలు విషయానికొస్తే.. పవన్ కల్యాణ్ సినీ, వ్యక్తిగత విషయాలను నిర్భయంగా బయటపెట్టి దుమ్ము దుమారం రేపాడు కత్తి మహేష్. తాజాగా పవన్ కల్యాణ్ రాజకీయ వ్యవహారాలపై కత్తి దూశాడు కత్తి మహేష్.
అయితే, ఇటవల పవన్ కల్యాణ్ తన అనంతపురం పర్యటనలో భాగంగా ఏపీ మంత్రి పరిటాల సునీత ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ఓ డిబేట్లో ప్రస్తావించిన విలేకరి ప్రశ్నకు సమాధానమిస్తూ జనసేన నాయకులేమో.. పవన్ కల్యాన్ టీడీపీ మిత్ర పక్షం జనసేన కాబట్టి పవన్ కల్యాణ్ మంత్రి పరిటాల సునీత ఇంటికి వెళ్లాడని, అలా అయితే, పవన్ కల్యాణ్‌ను ఉప ముఖ్యమంత్రిని చేసేద్దాం అన్నాడు. ఇదే నేపథ్యంలో అలాగే బీజేపీలోనూ పవన్ మిత్రపక్షం కాబట్టి పవన్ కల్యాణ్‌ను ఉప ప్రధానిని చేసేద్దామంటూ వ్యంగ్యాస్ర్తాలు సంధించారు పవన్ కల్యాణ్.