తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన జిల్లాల విభజన తరువాత ఏర్పడిన మేడ్చల్ జిల్లా పరిధిలోని నియోజకవర్గాలల్లో కుత్బుల్లాపూర్ ఒక్కటి.ప్రస్తుతం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కేపీ వివేకానందగౌడ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.ఎమ్మెల్యే వివేకానందగౌడ్ యువకుడు.. ఉత్సాహవంతుడు .. ప్రజలకు సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు..అయితే మొదటగా టీడీపీ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించిన వివేకానందగౌడ్.. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్న అధికార టీఆర్ఎస్ సర్కార్ చేపడుతున్న అభివృద్ది ,సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై …కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజల ఆకాంక్షల మేరకు టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరారు..సీఎం కేసీఆర్ మార్గ దర్శకత్వంలో గ్రేటర్ హైదరాబాద్‌లోనే అత్యంత వెనుకబడిన తన కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని ఇప్పుడు అభివృద్ధిలో పరుగులెత్తిస్తున్నారు.
కుత్బుల్లాపూర్ అనగానే మొదటగా ప్రారిశ్రామిక వాడలు, మురికివాడలు గుర్తుకువస్తాయి.గ్రేటర్ హైదరాబాద్ సిటీ , గ్రామీణ వాతావరణం కలగిసిన నగర శివారు ప్రాంతం ఇది . అయితే 2007లో జరిగిగిన నియోజక వర్గాల పునర్విభజనలో భాగంగా 2009 నుంచి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంగా ఏర్పడింది..జీహెచ్ఎంసీ లోని గాజులరామారం, జగద్గిరిగుట్ట, చింతల్, షాపూర్ నగర్, సూరారం, జీడిమెట్ల, కుత్భుల్లాపూర్ తో కలిపి మొత్తం 7 డివిజన్లతో ఏర్పాటైంది.ఈ క్రమంలో మొదటి సారి కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిన్న శ్రీశైలం గౌడ్ తనకు కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచారు..ఆ తర్వాత శ్రీశైలం గౌడ్ స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరించకపోవడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది.. దీంతో 2014 ఎన్నికల్లో స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తాడని చెప్పి టీడీపీకి తరపున పోటీ చేసిన యువనాయకుడు కేపీ వివేకానందగౌడ్‌ను గెలిపించారు కుత్బుల్లాపూర్ ప్రజలు.అయితే 2014లో స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది.. 2016లో గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అఖండ విజయం సాధించింది.. మరోవైపు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తెలంగాణ వ్యతిరేక విదానాలు ఇక్కడి తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలకు నచ్చలేదు..నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష బంగారు తెలంగాణ సీఎం కేసీఆర్ తోనే సాధ్యమనుకున్న టీడీపీ ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరుగా టీఆర్‌ఎస్‌లో చేరారు..అలా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ది కోసం ప్రజల కోరిక మేరకు వివేకానంద గౌడ్ కూడా టీఆర్ఎస్‌లో చేరారు. ఇక అక్కడ నుంచి వివేకానంద గౌడ్ వెనుతిరిగి చూసుకోలేదు.. కుత్బుల్లాపూర్‌ను తనదైన శైలిలో అభివృద్ది చేస్తున్నారు..
మంచి నీటి సరఫరా/మిషన్ భగీరథ..
కుతుబుల్లా పూర్ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కుంటున్న ప్రధాన సమస్య త్రాగునీటి సమస్య .నియోజక వర్గ వ్యాప్తంగా 2014వరకు కేవలం 2.3 మిలియన్ గ్యాలన్స్ నీటి సదుపాయంతో ప్రజలు తీవ్ర త్రాగునీటి సమస్యను ఎదుర్కునే వారు .2014లో తెలంగాణలో అధికారంలో వచ్చిన టీఆర్ఎస్ సర్కారు నీటి నిల్వ సామర్ధ్యాన్ని 6.27మిలియన్స్ గ్యాలనీలకు పెంచింది .. కుతుబుల్లా పూర్ ,గాజుల రామవరం సర్కిళ్ళలో ఉన్న మొత్తం 72 ,414 గృహ నివాసులల్లో ఇప్పటివరకు 61 ,414 గృహాలకు నీటి సరఫరాను 220 కోట్ల రూ.లతో ఆరు రిజర్వాయర్లు నిర్మించి 402 కి.మీల పైపు లైన్లు పనులు పూర్తిచేయడంలో సంబంధిత అధికారులు నిమ్నగ్నులై ఉన్నారు .ఒకప్పుడు పదిహేను రోజులకు ఒకసారి త్రాగునీరు వస్తే అదే అదృష్టం అని భావించిన నియోజక వర్గ ప్రజలకు సీఎం కేసీఆర్ సంకల్పంతోమంత్రి కేటీఆర్ ప్రోద్భలంతో మిషన్ భగీరథ ద్వారా గోదావరి జలాలను తీసుకురావడంతో నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు .
విద్యుత్ సరఫరా
తెలంగాణ ఏర్పడకముందు కరెంటు లేక పరిశ్రమలకు వారంలో మూడు నాలుగు రోజులు సెలవులు ప్రకటించడంతో కొన్ని వేలమంది ఉపాధిని కోల్పోయేవారు .అంతే కాకుండా కరెంటు ఎప్పుడు వస్తుందో ..ఎప్పుడు ఉంటుందో తెలియక ప్రజలు తీవ్ర కరెంటు సమస్యను ఎదుర్కునేవారు .రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఎస్ఎస్పీడీసీఎల్ కింద 76 కోట్ల రూ.లతో నాలుగు సబ్ స్టేషన్లను నిర్మించడం జరిగింది .890 పవర్ సప్లై చేసే విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లను ,663 కిలో మీటర్ల మేరకు హెచ్ టీ లైన్స్ , 1435 కిలోమీటర్స్ ఎల్టీ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది .దీంతో పరిశ్రమలకు ఇరవై నాలుగు విద్యుత్ సరఫరా అందడంతో ఉపాధిఅవకాశాలు పెగడంతో నియోజక వర్గంలో నిరుద్యోగ సమస్య క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది . స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నడు లేని విధంగా మొట్ట మొదటిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 24గం.ల విద్యుత్ ను అందించి చరిత్ర సృష్టించడం జరిగింది ..
రోడ్లు అభివృద్ధి..
నియోజకవర్గ ప్రధాన సమస్యలలో ఒకటి రోడ్లు .రోడ్ల సమస్యను పరిష్కరించడం కోసం దేవేందర్ నగర్ నుండి కైసర్ నగర్ మీదుగా ఇన్నర్ రింగ్ రోడ్డు వరకు మరియు సురారం నుండి శ్రీకృష్ణ నగర్ వరకు పనులు పూర్తీ అయ్యాయి .గాజుల రామవరం నుండి లాల్ సాబ్ గూడ మీదుగా ఇన్నర్ రింగ్ రోడ్డు వరకు , విశ్వకర్మ కాలనీ నుండి బోరంపేట్ ఇన్నర్ రింగ్ రోడ్డు వరకు అటవీ శాఖ నుండి అనుమతులు తీసుకొని నిధుల కోసం జీహెచ్ఎంసీ కు ప్రతిపాదనలు పంపడం జరిగింది . సుచిత్ర నుండి మున్సిపల్ కార్యాలయం వరకు మరియు ఐడీపీఎల్ క్రాస్ రోడ్డు నుండి ఆస్బెస్టన్ కమాన్ వరకు మరియు భుజంగ ధియేటర్ నుండి దివాన్ దాబా వరకు గల పైపు లైన్ రోడ్డు నిర్మాణం ,కల్వర్ట్ వెడల్పు ప్రతిపాదించడం జరిగింది . ఇంకా అనేక ప్రధాన రోడ్లను వెడల్పు చేయడము ,రోడ్ల మధ్య డివైడర్స్ , సెంటర్ లైటింగ్ ను ఏర్పాటు చేయడం కొరకు 25కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి .
కెమికల్ నాళాల
నియోజక వర్గంలో ఉన్న పలు పరిశ్రమల నుండి వెలువడే రసాయనాల డ్రైనేజీ లలో కలవడంతో భూగర్భజలాలు కాలుష్యం కావడం ..పరిశ్రమల నుండి వెలువడే రసాయనాలు గాలిలో కలవడంతో వాతావరణం కాలుష్యం కూడా ఎక్కువగా జరుగుతుండంతో ప్రజలు తీవ్ర కాలుష్య సమస్యలను ఎదుర్కుంటూ ఉండేవారు .2014 తర్వాత ఈ సమస్య పరిష్కారం కోసం సుభాష్ నగర్ ,ఐడీఏ జీడిమెట్ల నుండి పైపులైన్ రోడ్డు వరకు 9.2కోట్లతో ప్రధాన కెమికల్ నాళాల నిర్మాణ పనులు ప్రారంభమై నిర్మాణ పనులు అత్యంత శరవేగంగా జరుగుతున్నాయి .పైపు లైన్ రోడ్డు నుండి కుతుబుల్లా పూర్ విలేజ్ వరకు ప్రధానకెమికల్ నాళాల నిర్మాణం కోసం 21కోట్ల రూపాయలతో ప్రతిపాదించడం జరిగింది .త్వరలోనే వీటి నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి .
పార్కుల అభివృద్ధి ..
సుభాష్ నగర్ డివిజన్ లో ఉన్న దుళ్ళపల్లి అటవీ ప్రాంతంలో 22 ఎకరాల విశాల ప్రదేశంలోఅర్భన్ లంగ్స్ స్పేస్ పార్కును (ప్రశాంత వనం )నిర్మించడంతో స్థానికులు మంచి ఆహ్లాదకర వాతావరణంలో మార్నింగ్ వాకింగ్ చేయడం ..సాయంత్రం ఆహ్లాదకర వాతావరణంలో గడుపుతూ ప్రజలు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు .అతిత్వరలో సురారంలో మరొక లంగ్స్ ప్లేస్ పార్కు ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరిగింది .17పార్కులు కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్వర్యంలో నడపబడుతున్నాయి .27పార్కులల్లో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి .నాలుగు కోట్లతో పద్దెనిమిది పార్కుల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి .
హరితహారం
తెలంగాణ రాష్ట్రంలో అడవులను ,పచ్చదనాన్ని పెంచడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేస్తున్న కార్యక్రమం హరితహారం .హరితహారం కార్యక్రమంలో భాగంగా కుతుబుల్లా పూర్ నియోజకవర్గంలో మొత్తం 4 ,40 ,000మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకుంటే 5,24 ,050 మొక్కలను నాటడం జరిగింది .నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలకు 4,95,280మొక్కలను పంపిణీ లక్ష్యంగా పెట్టుకుంటే 4,31,248మొక్కలను పంపిణీ చేయడం జరిగింది..
మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్స్..
ప్రజల కోసం నియోజకవర్గంలో 2.10 కోట్లతో భగత్ సింగ్ నగర్ 128 డివిజన్లో నిర్మించదలచిన మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్స్ నిర్మాణం తుది దశలో ఉంది.టీఎస్ఐఐసీ కాలనీలో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్స్ నిర్మాణం కోసం భూములను సేకరించడం జరిగింది .అతిత్వరలో పనులు ప్రారంభం కాబోతున్నాయి .ట్రక్ పార్కింగ్ కొరకు టీఎస్ఐఐసీ రెండున్నర ఎకరాల స్థలం కేటాయించడం జరిగింది .
ఆస్పత్రులు ..
తెలంగాణ రాష్ట్రంలో వైద్య ,విద్య రంగాల అభివృద్ధి సీఎం కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ సర్కారు పలు కార్యక్రమాలను అమలు చేస్తుంది .అందులో భాగంగా కేసీఆర్ కిట్లు ,ఆస్పత్రులు నవీకరణ ..ప్రధాన ఆస్పత్రుల నుండి ప్రాధమికోన్నత ఆస్పత్రుల వరకు నర్సింగ్ పోస్టులు ,వైద్యుల పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది .ఈ క్రమంలో నియోజక వర్గంలో షాపూర్ నగర్ లో ఉన్న అర్భన్ సెంటర్ ఆస్పత్రిని 50 పడకల ఆస్పత్రిగా మార్చడానికి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించడం జరిగింది .మూడు అర్భన్ హెల్త్ సెంటర్ల ఏర్పాటుకు వైద్య శాఖ నుండి అనుమతులు వచ్చాయి .రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బస్తీ దవాఖానలలో భాగంగా కొత్తగా జీడిమెట్ల ,చింతల్ ,ఐడీపీఎల్ ,సుభాష్ నగర్ లలో ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయి .నియోజక వర్గ వ్యాప్తంగా ఉన్న పలు సర్కారు దవాఖానల ద్వారా అర్హులకు కేసీఆర్ కిట్లను అందించడం కూడా జరుగుతుంది .
అంగన్ వాడి కేంద్రాలు ..
190 అంగన్ వాడీ కేంద్రాలను పలు దశల్లో అభివృద్ధి చేసి వాటి ద్వారా బాలింతలకు ,పిల్లలకు పౌష్టిక ఆహారాన్ని అందించడం జరుగుతుంది.గత నాలుగు ఏండ్లుగా క్రమక్రమంగా తగ్గిన నవజాతి శిశు మరణాలు ..
2014 113
2015 96
2016 94
2017 46
శిశుమరణాల శాతం ఇలా ఉంది ..
దేశంలో 34 ,రాష్ట్రంలో 31 ,నియోజకవర్గంలో 12 శాతంగా శిశు మరణాల శాతం నమోదైంది.
ట్రాపిక్ సమస్య -పరిష్కారం..
హైదరాబాద్ మహానగరంలో ప్రధాన సమస్య ట్రాఫిక్ .ఉదయం ,సాయంత్రం అయితే మరి ఎక్కువగా ఉంటుంది .అందులో బాలానగర్ ,సుచిత్ర జంక్షన్ ,కొంపల్లి దగ్గర ఎక్కువగా ఉంటుంది .ఈ సమస్యను పరిష్కరించడంకోసం బాలానగర్ లో 387 కోట్లతో ప్లై ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం మంత్రి కేటీఆర్ శంఖుస్థాపన చేయడంతో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి ..సుచిత్ర జంక్షన్ దగ్గర ప్లై ఓవర్ ప్రతిపాదించడం జరిగింది .దుల్లపల్లి జంక్షన్ , కొంపల్లి ఎక్స్ రోడ్డు దగ్గర ట్రాపిక్ సమస్యను పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకోవడం జరిగింది .జగద్ఘీరగుట్టలో ట్రాపిక్ సమస్యను పరిష్కరించడంకోసం హెచ్ఎంటీ యాజమాన్యంతో పలుదఫాలుగా చర్చలు జరపడం జరిగింది .దీంతో త్వరలోనే హెచ్ఎంటీ వారి నుండి స్థలాన్ని సేకరించి బస్ డీపోను నిర్మించి ట్రాపిక్ సమస్యను పరిష్కరించడానికి ఆ యాజమాన్యంతో చర్చలు తుది దశలో ఉన్నాయి .అదేవిధంగా గాజుల రామవరంలో డంప్ యార్డ్ ఏర్పాటుకు హెచ్ఎంటీ యాజమాన్యంతో చర్చలు కొనసాగుతున్నాయి .
ఎల్ఈడీ వీధి దీపాలు..
నియోజక వర్గ వ్యాప్తంగా ఎల్ఈడీ లైట్ల శోభ వెలుగులను విరజిమ్ముతుంది .అందులో భాగంగా కుతుబుల్లా పూర్ సర్కిల్ లో 11 269 ,గాజుల రామవరంలో 10 ,424 మొత్తంగా కల్పి 21 ,693 ఎల్ఈడీ బల్బులను ఏర్పాటు చేసి అనుకున్న లక్ష్యానికి 98. 47% పూర్తి చేసి జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న మొత్తం ముప్పై సర్కిల్స్ లో మొదటి రెండు స్థానాలను దక్కించుకున్నాయి .
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం..
తెలంగాణ రాష్ట్రంలో సొంత ఇల్లు లేని పేదవాడు సగర్వంగా గుండె మీద చేయి వేసుకొని జీవించాలని ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం ..నియోజకవర్గంలో 13 ,656 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను 1172 కోట్ల రూపాయలతో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి .వీటి నిర్మాణ పనులను మంత్రి కేటీఆర్ మరియు జిల్లా మంత్రి మహేందర్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది .నియోజక వర్గంలో 58 జీవో ప్రకారం మొత్తం ముప్పై వేలమంది అర్హులైన బీదవారికి భూమి పట్టాలను పంపిణి చేయడం జరిగింది .మిగిలిన అర్హులకు భూపట్టాలు పంపిణికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి .
కళ్యాణ లక్ష్మీ /షాదీ ముబారక్
తెలంగాణ రాష్ట్రంలో పేదింటి ఆడబిడ్డకు పెద్దన్నగా అండగా ఉండాలని లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు కళ్యాణ లక్ష్మీ /షాదీ ముబారక్ . నియోజకవర్గంలో ఉన్న డివిజన్లలలో మొత్తం 1035 మందికి కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ కింద మొత్తం 5.76 కోట్ల రూపాయలను అర్హులకు అందజేసి అండగా నిలిచింది .
“ఆసరా పెన్సన్స్”
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వృద్ధులు ,ఒంటరి మహిళలు ,వికలాంగులకు టీఆర్ఎస్ సర్కారు పెన్షన్స్ ను పెంచింది .ఈ క్రమంలో కుతుబుల్లా పూర్ నియోజకవర్గంలో 16 ,033 మందికి పించన్లు అందిచడానికి నెలకు 1.75 కోట్ల రూపాయలను అర్హులకు అందజేస్తూ గత 42 నెలల నుండి దాదాపు 73 కోట్లను అందించడం జరిగింది .
“సీఎం రీలీఫ్ ఫండ్ “
రాష్ట్ర వ్యాప్తంగా పేదవారు అనారోగ్యానికి గురైతే పెద్ద పెద్ద ఆస్పత్రులకు వెళ్లి చూయించుకునే ఆర్థిక స్థోమత ఉండదు .అలాంటి వారి కోసమే సీఎం కేసీఆర్ నేను ఉన్నాను అని భరోసా కల్పిస్తూ అమలు చేస్తున్న పథకం సీఎంఆర్ఎఫ్ .ఇప్పటి వరకు నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే ,ఎమ్మెల్సీ సహకారంతో మొత్తం దాదాపు 1429 మంది ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా 1141 మందికి సుమారు 7.13 కోట్ల రూపాయలను మంజూరు చేయించి అర్హులకు అండగా నిలబడ్డారు .మరో రెండు 288 మంది దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి .
ఈ విధంగా నమ్ముకున్న ప్రజలకు మంచి చేయడమే నిజమైన నాయకత్వ లక్షణం అని నమ్మిన వివేకానందగౌడ్ ఆ దిశగా ప్రజలకు అండగా నిలబడుతున్నారు..ప్రతి రోజు నియోజకవర్గంలోని మురికివాడలు, స్లమ్ ఏరియాలు, డివిజన్లతో ప్రజలతో మమేకం అవుతూ వారి సమస్యలను పరిష్కరిస్తూ మీకు నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు.. టీఆర్ఎస్‌లో చేరిన తర్వాత వివేకానంద గౌడ్ చేస్తున్న అభివృద్ది పట్ల కుత్బుల్లాపూర్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు..యువనాయకుడికే మరోసారి అవకాశం ఇస్తే తమ నియోజకవర్గం మరింతగా అభివృద్ధి చెందుతుందని ప్రజలు భావిస్తున్నారు. మరోవైపు వివేకానందగౌడ్ టీఆర్ఎస్‌లో చేరడంతో టీడీపీ పార్టీ పూర్తిగా బలహీనపడింది..క్యాడర్ మొత్తం వివేకానంద వెంట టీఆర్ఎస్‌లో చేరారు. ఈ విధంగా మొత్తానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కారు 100 స్పీడుతో అభివృద్దిలో దుసుకుపోతుంది.