ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈ రోజు నుండి ప్రారంభం కానుంది.ఈ జాతర నలుగు రోజులపాటు జరగనుంది. ఇవాళ సారలమ్మ ,పగిడిద్ద రాజు ,గోవిందరాజులు గద్దెలపై కి రానున్నారు.సాయంత్రం కన్నెపల్లి నుంచి పూజారులు సారలమ్మను గద్దెపైకి తీసుకురానున్నారు. రేపు పగిడిద్ద రాజు, సమ్మక్కల వివాహం జరగనుంది. ఎల్లుండి భక్తులు మొక్కులు తీర్చుకోనున్నారు.కాగా ఈ మహా జతరకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది.
మేడారం జాతరలో 10 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ,పారిశుద్ధ్య సేవలో 3 వేల మంది సిబ్బంది ,20 శాఖలకు చెందిన 29వేల మంది సిబ్బంది భక్తులకు సేవలందించనున్నారు.అలాగే మేడారం జాతరకు ఆర్టీసీ 4200 బస్సులు నడుపుతోంది.జాతరలో 700 మంది ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ వాలంటీర్ల సేవలు అందించనున్నారు. జంపన్న వాగు వద్ద భక్తుల రక్షణ కోసం 300 మంది గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు.మేడారం జాతర పరిసర ప్రాంతాల్లో 56 వైద్య శిబిరాల ఏర్పాటు చేశారు.పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 46, అటవీశాఖ ఆధ్వర్యంలో 100 ఆధునిక గూడారాలు ఏర్పాటు చేశారు.కాగా ఫిబ్రవరి 2 న ముఖ్యమంత్రి కేసీఆర్ మేడారం వెళ్లనున్న సంగతి తెలిసిందే.