రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేసి మరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన స్వప్రయోజనాలే లక్ష్యంగా నాడు హడావుడిగా అమరావతి నిర్మాణాన్ని మొదలు పెట్టారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. కాగా.. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాజధానిలో పది సంవత్సరాలు ఉండొచ్చు కదా..?, అయినా హైదరాబాద్ నుంచి అమరావతికి హుటాహుటిని ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది అంటూ చంద్రబాబు నాయుడుపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఎవరైనా శంకుస్థాన రోజునే కాపురం మార్చేస్తారా..? అంటూ చంద్రబాబును ఎద్దేవ చేశారు. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు.
see also : నిరుద్యోగులకు టీ సర్కార్ శుభవార్త..!
చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి స్వప్రయోజనాల మీద చూపించి ఉంటే ఈ పాటికి పోలవరానికి కొంత రూపు వచ్చి ఉండేందన్నారు. పోలవరంపై టీడీపీ అలసత్వం ప్రదర్శించిందన్నారు. చంద్రబాబు అనుకుంటున్నట్లు గాంధీ పక్కన, అంబేద్కర్ గారి పక్కన మీ ఫోటోగనక వెళితే మాకు సంతోషమే. ఎందుకంటే మీరు అన్నేళ్లు పరిపాలించారు. కానీ, మీ గురించి మాట్లాడుకునే సమయానికి నెగిటివ్ మాటలే ఎక్కువగా వస్తాయి.. పాజిటివ్ మాటలు రావు. ఎందుకంటే మీరు ఎన్నికల్లో సొంతంగా ఎప్పుడూ నెగ్గలేదు. మీరు ముఖ్యమంత్రి అయినప్పటి ఎన్టీఆర్ గెలిపించి పెట్టిన అసెంబ్లీ అది. దాన్ని మీరు ఆక్యుపై చేసుకుని ముఖ్యమంత్రి అయ్యారు.
see also : నిజాన్ని బయటపెట్టిన మంత్రి కేటీఆర్
1999లో బీజేపీతో..పొత్తుపెట్టుకుని గెలిచిన చంద్రబాబు తరువాత జరిగిన 2004, 2009 ఎన్నికల్లో దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారంటూ ఉండవల్లి అరుణ్‌కుమార్ చంద్రబాబుపై ఫైరయ్యారు. 2014లో చంద్రబాబు రాజకీయ అందరికీ తెలిసిందే. ఓ పక్క మోడీ, మరో పక్క పవన్ కల్యాణ్. ఇంతమంది సాయపడితే 1.2 శాతం ఓట్లతో తేడాతో మళ్లీ గెలిచారన్నారు. మీ ఫోటో మీ ఇంట్లో తప్ప గాంధీ, అంబేద్కర్‌పక్కన పెట్టేంత అర్హత చంద్రబాబుకు లేదని ఉండవల్లి ఎద్దేవ చేశారు.
see also : నాగ శౌర్యతో- నిహారిక పెళ్లి.. ఒప్పేసుకున్న చిరంజీవి.. నాగబాబు రివర్స్..?