సౌజన్యం : ఇలపావులూరి మురళీ మోహన్ రావు గారు..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీయార్ హైదరాబాద్ దాటి అడుగు బయట పెట్టడం లేదు. కానీ, పారిశ్రామిక పెట్టుబడులు వరదల్లా తెలంగాణ వైపు దూసుకొస్తున్నాయి. రాష్ట్ర ఐటి మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, ఇతర అధికారులు ప్రపంచదేశాన్ని చుట్టివస్తున్నా, నయాపైసా కూడా పెట్టుబడులు రావడం లేదు. కానీ కెటియార్ మాత్రం ఏ దేశం వెళ్లినా పెట్టుబడుల మూటలతో విజయవంతంగా తిరిగి వస్తున్నారు.
see also :సీఎం కేసీఆర్ హర్షం..!
తాజాగా లూలూ గ్రూపు తెలంగాణాలో రెండువేల అయిదువందల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. తొలుత ఈ గ్రూప్ ఆంధ్రప్రదేశ్ వైపు కన్నేసినా, అక్కడికంటే తెలంగాణ లోని మౌలికవసతులు వారి చూపును తెలంగాణ వైపు మరల్చాయి. అలాగే బీ ఆర్ షెట్టి గ్రూప్ కూడా తెలంగాణాలో వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి అంగీకారం తెలిపింది. మరో మూడు నెలల్లో కేసీయార్ చేతులమీదుగా వీటికి శంకుస్థాపన జరగబోతున్నది.
అంతే కాదు.. కెటియార్ ఎక్కడకు వెళ్లినా, అక్కడి పారిశ్రామికవేత్తలు ఆయన్ను వ్యక్తిగతంగా ప్రశంసిస్తున్నారు. అక్కడి పారిశ్రామికవేత్తలను ఒప్పించడంలో కెటియార్ కృతకృత్యులు అవుతున్నారు. లూలూ గ్రూప్ చైర్మన్ యూసుఫ్ ఆలీ మాట్లాడుతూ “కొత్త రాష్ట్రమైనా, ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం, స్పందన లభించింది” అని చెప్పడం విశేషమే.
see also : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం.. టాప్ గేర్లో దుసుకుపోతున్న కారు..!
నిన్న మంత్రి తారక్ మాట్లాడుతూ.. ఈ పరిశ్రమలు రావడం వలన తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్ కు ఇద్దరికీ ప్రయోజనమే అని చెప్పడం ఆయన ఔన్నత్యాన్ని చాటుతుంది. ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఒక్కరు కూడా మార్యాదాపూర్వకంగా కూడా అలా మాట్లాడినట్లు లేదు ఇంతవరకు.
ఏ రాష్ట్రంలో అయినా, పెట్టుబడులు రావాలంటే అక్కడ ఉండాల్సిన ప్రధాన లక్షణాలు ప్రభుత్వం అవినీతిరహితంగా ఉండాలి. ఇరవైనాలుగు గంటలు కరెంట్ ఇవ్వాలి. నీటివసతి కల్పించాలి. లంచగొండితనం లేకుండా ఉండాలి. ఈ ప్రధాన లక్షణాలు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నాయి కాబట్టే ఇక్కడ పెట్టుబడి వరదలు, ఆంధ్రప్రదేశ్లో పడికట్టు మాటల, స్వోత్కర్షల ఉప్పెనలు వస్తున్నాయి.
చేసుకున్నవారికి చేసుకున్నంత మహాదేవ!
see also : నెల్లూరులో టీచరమ్మతో యువకుడు సెక్స్ చేసి..వీడియో యూట్యూబ్లో