హైదరాబాద్ లో దారుణం జరిగింది. నగరంలో నేరాల సంఖ్య పెరిగిపోతున్నది. హత్యలు..దొంగతనాలు..ఎక్కువగా జరగడంతో పోలిసులు అప్రమత్తమయ్యారు. నగరంలో ఎప్పుడు..నిరంతరం రద్దీగా ఉండే ప్రధాన రోడ్డు ..అలాంటి రోడ్డులో పోలీసులే షాక్ అయ్యో ఘటన జరిగింది. కొండాపూర్ బొటానికల్‌గార్డెన్ నుంచి మసీద్‌బండకు వెళ్లే దారిలో రోడ్డు పక్కనే రెండు సంచుల మూటలు పడి ఉన్నాయి. వాటి నుంచి దుర్వాసన వస్తుండటాన్ని జీహెచ్ యంసీ కార్మికులు గమనించి పోలీసులకు మంగళవారం పోలీసులకు సమాచారం అందించారు. వేంటనే పోలీసులు వాటిని పరిశీలించగా ఒక సంచిలో తల, కాళ్లు, చేతుల ముక్కలు ఉండగా మరో గోనె సంచిలో మొండెం ఉన్నాయి.
see also..వైసీపీ నుండి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు షాక్..2019లో మొత్తం ఓడిపోతున్నార
పూర్తిగా కుళ్లిపోయిన దశలో ఉన్నాయి. పోలీసులు వాటిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి వైద్యులతో శవపరీక్ష చేయించగా కళ్లు చెమర్చే విషయాలు వెలుగు చూశాయి. ఆ మహిళను తీవ్రంగా కొట్టి చంపి.. తర్వాత ముక్కలుగా నరికినట్లు తేలింది. మొత్తం 8 ముక్కలు చేయగా అనేక ప్రాంతంలో ఎముకలను విరిగినట్లు గుర్తించారు. ఆమె ఎనిమిది నెలల గర్భిణి కాగా కడుపులో మగ శిశవు పిండం పూర్తిగా ఛిద్రమైన స్థితిలో కనిపించింది. ఆమెకు 30 సంవత్సరాల వయసు ఉండొచ్చని, మెరూన్ రంగు టాప్, ఎరుపు రంగు కుర్తా పైజామా ధరించి ఉందని పోలీసులు తెలిపారు. చేతులకు గాజులు, కాళ్లకు మెట్టలు ఉన్నాయి. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలు పరిశీలించగా ఓ కారు అక్కడ చాలాసేపు ఆగి ఉన్నట్లు గుర్తించారు. దానిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.