వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిలో ఉన్న నిజాయితీ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లో లేదట. స్వయాన చిరంజీవి, పవన్ కల్యాణ్‌ల బావ అల్లు అరవింద్ అన్న మాటలే ఇవి.
ఇంతకీ అసలు విషయమేమిటంటే.. సినీ నటుడు, పవన్ కల్యాణ్ 2014 ఎన్నికలకు ముందు జనసేన పార్టీని స్థాపించారు. పార్టీ స్థాపన రోజు తప్పు చేసిన వారిని ప్రశ్నించేందుకే జనసేన, ప్రజల తరుపున అధికార పార్టీ అని కూడా చూడకుండా ప్రశ్నిస్తాం.. అంటూ ప్రగల్భాలు పలికారు కూడా పవన్ కల్యాణ్. పవన్ కల్యాణ్ అలా చెప్పాడో లేదో 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమితో జతకట్టారు జనసేనాని, ఆ రెండు పార్టీల తరుపున ప్రచారం చేశారు కూడాను. అంతకు ముందే చంద్రబాబుపై అనేక కేసులు ఉన్న విషయం పవన్‌కు గుర్తుకు రాలేదా..? వాటిని ప్రశ్నించడంలో పవన్ కల్యాణ్ వెనక్కు తగ్గారన్నది జగమెరిగిన సత్యం.
ఆ విషయం ఆటుంచితే.. 2014లో కేంద్రంలో బీజేపీ, ఏపీలో టీడీపీ అధికారం చేపట్టిన విషయం తెలిసిందే. ప్రత్యేక హోదా ఇస్తామన్న కేంద్రం ప్యాకేజీతో సరిపెట్టింది. అలాగే, పోలవరం విషయంలోనూ చంద్రబాబు అంతా నేనే చేస్తానంటూ నెత్తిమీద వేసుకుని ఇప్పుడు ఎత్తి నేలమీదేశాడు. ఇలా తన కుఠిల రాజకీయాన్ని ప్రదర్శించారు చంద్రబాబు. ఆ తరువాత చంద్రబాబు నోటుకు ఓటు కేసులో ఇరుక్కుని కేంద్రం వద్ద సాగిలపడ్డాడు. ఇలా జరుగుతున్న పరిణామాలన్నీ పవన్ కల్యాణ్‌కు తెలిసినా నిక్కచ్చిగా ప్రశ్నించడంలో విఫలమయ్యాడు.
మరో పక్క ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని, చంద్రబాబు అవినీతి రాజకీయాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై విరుచుకుపడటంతో మాత్రం పవన్ కల్యాన్ మాత్రం పది అడుగులు ముందుకేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అక్కడితో ఆగక అవినీతి పాలన కొనసాగిస్తున్న చంద్రబాబుకు భజన చేసేందుకు మాత్రం పవన్ తన సినిమాలను సైతం వదులుకున్నాడు. రెండు మూడు రోజులు ఏపీ పర్యటన అంటూ చంద్రబాబు భజన చేస్తూ విశ్రాంతి తీసుకుంటున్న విషయం విధితమే.
జగన్ అందరినీ త్వరగా నమ్మే వ్యక్తి అని, కానీ, పవన్ మాత్రం అలా కాదని, తన నీడను కూడా నమ్మడని సంచలన వ్యాఖ్యలు చేశారు అల్లు అరవింద్. ఏది ఏమైనా జగన్‌లో ఉన్న నిజాయితీ పవన్ కల్యాణ్‌కు లేదంటూ అల్లు అరవింద్ చెప్పడం గమనించ దగ్గ విషయమే మరీ.