ఆంధ్రప్రదేశ్ లో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సాగిస్తున్న ప్రజా సంకల్ప యాత్ర 74వ రోజు సోమవారం నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం వద్ద వెయ్యి కిలోమీటర్ల మైలు రాయిని దాటింది. ఈ అరుదైన ఘట్టం చిరకాలం గుర్తుండేలా అభిమానులు అక్కడ ఏర్పాటు చేసిన విజయ సంకల్ప స్తూపాన్ని వైఎస్ జగన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. ఉదయం నుంచే వాళ్లంతా జననేత అడుగులో అడుగులేశారు. వెయ్యి కిలోమీటర్ల దిగ్విజయ యాత్రను పురస్కరించుకుని అభిమానులు వెయ్యి కొబ్బరికాయలు కొట్టారు. మరోపక్క భారిగా వైసీపీలోకి చేరికలు జరిగాయి.
ఏపీ యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పార్టీ సోషల్ మీడియా చైర్మన్‌గా పనిచేసిన కేతంరెడ్డి వినోద్‌రెడ్డి వైసీపీలో చేరారు. యువత, విద్యార్థులతోపాటు అన్నివర్గాల ప్రజల కోసం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న అవిరళ కృషికి ఆకర్షితుడనై వైసీపీ ముఖ్యనేత వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీలో చేరినట్లు కేతంరెడ్డి పేర్కొన్నారు
