ఆంధ్రప్రదేశ్ మాజీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి.. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తల్లి అయిన వై ఎస్ విజయమ్మ
ప్రజల్లో రాజశేఖర్ రెడ్డి మీద అంత అభిమానం ఉందన్న విషయాన్ని కాంగ్రెస్ హైకమాండ్ కూడా గుర్తించలేకపోయిందన్నారు. ఓదార్పు యాత్ర కోసం అనుమతి ఇవ్వాలంటూ తాము సోనియా గాంధీని కలిస్తే… రాష్ట్రమంతా ఓదార్పు యాత్ర చేయడానికి వీల్లేదని ఆమె చెప్పారన్నారు. ఒక విగ్రహం పెట్టి.. అందరినీ ఒకచోటికి పిలిచి కార్యక్రమం చేయండి అంతకు మించి ఏమీ చేయడానికి వీల్లేదని సోనియా గాంధీ అన్నారని చెప్పారు. చివరకు తన చిన్నాన్నను కూడా కుటుంబం నుంచి విడదీసేందుకు కాంగ్రెస్ చేసిన కుట్రను జగన్ జీర్ణించుకోలేకపోయారని.. ఆ క్షణమే పార్టీలో ఇక మనం ఉండలేమమ్మా.. బయటకువెళ్లిపోదామని జగన్ చెప్పారని విజయమ్మ గుర్తు చేసుకున్నారు.
జగన్ ఆ సమయంలో పార్టీ పెట్టడమే తనకు కూడా సమంజసం అనిపించిందన్నారు. 2009 ఎన్నికల్లో ఏపీ నుంచి 10 లేదా 12 ఎంపీ సీట్లు మాత్రమే వస్తాయని సోనియా భావించారన్నారు. అయితే వైఎస్ మాత్రమే వెళ్లి 33 నుంచి 36 వరకు ఎంపీ స్థానాలు వస్తాయని.. ఎన్నికల తర్వాత మీరే డిసైడ్ చేయండి అని సోనియా గాంధీకి చెప్పి మరీ వచ్చారని విజయమ్మ గుర్తు చేసుకున్నారు. హెలికాప్టర్ ప్రమాదం రోజు వర్షం వస్తుండడంతో వాయిదా వేసుకోవాల్సిందిగా తాను చెప్పానని.. వైఎస్ మాత్రం చాలా పనులు ఉన్నాయి. చాలా సమస్యలు పరిష్కరించాలి అంటూ వెళ్లిపోయారని గుర్తు చేసుకున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైన చివరకు దేవుడే న్యాయం చేస్తారన్నది జగన్ నమ్మకమని విజయమ్మ వ్యాఖ్యానించారు. ఇక వైఎస్ మరణం వెనుక ఉన్న నిజమేంటో ఆ పైవాడికి తెలుసని… ఓ మంచి మనిషి ప్రజలకు దూరమయ్యారని… మేం కుటుంబ పెద్దను కోల్పోయామని చెమర్చిన కళ్ళతో భావోద్వేగానికి గురయ్యారు వైఎస్ విజయమ్మ.