తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరైన విషయం తెలిసిందే.ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ కు ఆహ్వానం అందలేదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి చేస్తున్న ఆరోపణలకు ట్విట్టర్ వేదికగా తనదైన శైలిలో జవాబు ఇచ్చారు. ప్రపంచ ఆర్థిక సదస్సుకు రావాలంటూ తనకు పంపిన ఆహ్వానానికి సంబంధించిన ఈ-ఇన్విటేషన్, ఈమెయిల్ కాపీలను మంత్రి కేటీఆర్ పోస్ట్ చేశారు.
Our intellectually bankrupt Telangana congress president alleges that I hadn’t received an invite from @wef
For his sake, attached are the copies of e-invitation & email from WEF
P.s: Uttam Kumar Garu, I am no Pappu. Hope you have the decency to correct yourself pic.twitter.com/nBl4eMlgpR
— KTR (@KTRTRS) January 30, 2018
ఈ సందర్బంగా ‘మేధో దివాళాకోరుతనానికి ప్రతీక అయిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి నాకు ఆహ్వానం అందలేదని ఆరోపిస్తున్నారు. ఆయన కోసం ఈ ఆహ్వానం కాపీలను వెల్లడిస్తున్నాను… ఉత్తమ్‌గారూ.. నేను ‘పప్పూ’ను కాదు.. ఇప్పటికైనా మిమ్మల్ని మీరు హుందాగా కరెక్ట్ చేసుకుంటారని ఆశిస్తున్నా’ అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
see also : వచ్చే ఎన్నికల్లో వార్ వన్ సైడే..ఎంపీ కవిత
see also : కొబ్బరి నీళ్ళు త్రాగడం వలన కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే
see also : నిరుద్యోగులకు టీ సర్కార్ శుభవార్త..!