ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర రికార్డును సృష్టించింది. నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం సైదాపురంలో వైఎస్ జగన్ వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. అయితే, ప్రజా సంకల్ప యాత్ర వెయ్యి కిలోమీటర్లు చేరుకున్న తరుణంలో సైదాపురంలో వైఎస్ఆర్ శ్రేణులు 25 అడుగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థూపాన్ని ఏర్పాటు చేశారు.
మరో పక్క ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు జగన్కు మద్దతుగా పాదయాత్ర చేశారు. అయితే, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఢిల్లీలో వైసీపీ ఎంపీలతో పాదయాత్ర చేయగా.. ఆంధ్రప్రదేశ్లోని 25 పార్లమెంటు నియోజకవర్గాలు, 640 మండల కేంద్రాలతోపాటు గ్రామ గ్రామాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్కు మద్దతుగా పాదయాత్ర చేశారు.
అదే విధంగా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాలతోపాటు అమెరికా, బ్రిటన్ర యూఏఈ, సింగపూర్, షార్జా, కెనడా, దుబాయ్ దేశాల్లో ఉన్న వైసీపీ ఎన్ఆర్ఐ విభాగం జగన్కు మద్దతుగా పాదయాత్ర చేశారు.