జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ యాత్రను తెలంగాణలో స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆ తర్వాత ఏపీలో మొదలు పెట్టిన పవన్ అనంతపురం జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో జనసేనాని తన రాజకీయ భవిష్యత్తు పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వేడిని పెంచింది. ఇక పవన్ మాట్లాడుతూ.. జనసేన వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందని అన్నారు. అంతేకాకుండా తమ పార్టీ టీడీపీ, వైఎస్ ఆర్ కాంగ్రెస్, బీజేపీలలో దేనికి మద్దతు ఇస్తుందో అనేది తెలియదని అన్నారట.
దీంతో పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. పవన్ వ్యాఖ్యలను బట్టి ఆలోచిస్తే పవన్ వచ్చే ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చే అవకాశం లేదని కనిపిస్తోందని సోషల్ మీడియాలో పోస్టులు ట్రాల్ అవుతున్నాయి. ఎలా అంటారా.. పవన్ చేసిన వ్యాఖ్యలు జాగ్రత్తగా గమనిస్తే.. వచ్చే ఎన్నికల నాటికి తాను సూచించే సమస్యలకు ఏ పార్టీ అయితే పరిష్కారం చూయిస్తుందో ఆ పార్టీకి మద్దతు ఇస్తానని పవన్ హిందూపూర్ సదస్సులో అన్నారు. ప్రస్తుతానికి టీడీపీ నేతలను పవన్ కలుస్తున్నా కూడా.. అయితే తను ఆశించిన ఫలితం మాత్రం రావడంలేదు. ప్రస్తుతం ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా టీడీపీ అధినేత దగ్గర నుండి ఒక్కడంటే ఒక్క నేత కూడా ఆ దిశగా అడుగుల వేయడంలేదు. చంద్రబాబు పాలనలో ఎక్కడి సమస్యలు అక్క డే ఉన్నాయి.. అప్పులు మాంత్రం విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో పవన్ పెట్టిన కండిషన్స్ చూస్తే ఖచ్ఛితంగా పవన్ సపోర్ట్ టీడీపీకి ఉండదని.. ఒకవేళ ఇస్తే అతన్ని పవర్ స్టార్ కాదు ఫ్లవర్ స్టార్ అంటారని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.