ఏపీలో వైసీపీ నేతలను వందల కొట్టు ఆశ చూపి టీడీపీలోకి చేర్చుకున్నారని ఎన్నో సార్లు ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు పై నిప్పులు చేరిగిన సంగతి తెలిసిందే… అయితే కొంత మంది వైసీపీ నాయకులు చంద్రబాబు ఎన్ని కొట్లు ఇచ్చిన జగన్ తోనే ఉంటాం అన్నారు. ఇక తాజాగా నా ప్రాణం పోయినా టీడీపీలోకి వెళ్లనని బల్లగుద్ది చెప్పాడు నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు . నూజివీడును ఎవరూ చేయనంత అభివృద్ధిని తాను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేయడం జరిగిందని, దీనికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అందించిన తోడ్పాటు చాలా గొప్పదని ఆయన అన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు మద్దతుగా వాక్‌విత్ జగన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం నూజివీడు పట్టణంలో జరిగిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మహానేత కుమారుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన పార్టీలో ఆయనకు అండగా ఉండాల్సిన బాధ్యత తనకు ఉందన్నారు. తన శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసినా పార్టీ మారాల్సిన అవసరం లేదన్నారు. తాను ప్రజల మనిషినని, నిత్యం ప్రజలలో ఉండేవాడినని, రాబోయే ఎన్నికలలో తిరిగి గెలిచి నూజివీడు అభివృద్ధికి తన శాయశక్తులా కృషి చేస్తానన్నారు.
One comment
Pingback: వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర 1000 కి.మీ పూర్తి…ఏం సాధించాడో తెలుసా – Dharuvu