మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర ఈనెల 31 నుంచి వచ్చే నెల ఫిబ్రవరి 3 వరకు జరగనున్న విషయం తెలిసిందే.. భక్తులు భారీ సంఖ్యలో వస్తుండటంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది . జాతర ఇంకా ప్రారంభం కాకముందే వన దేవతలను దర్శించుకోవడానికి భక్తులు మేడారానికి బారులు తీరుతున్నారు. దీంతో మేడారం జన సంద్రంగా మారుతున్నది. ఇందులో భాగంగా మేడారం జాతర రాకపోకలకై సమస్యలు తలెత్తకుండా అధికారులు జాతరకు వచ్చే రూట్‌ను.. జాతర నుంచి తిరిగి వెళ్లే రూట్‌ను వన్‌వే రూట్‌గా మార్చారు.ఆ వివరాలు మీకోసం
మేడారం జాతర…వన్ వే రూట్ వివరాలు..
? వరంగల్, హన్మకొండ మీదుగా వచ్చే వాహనాలు ములుగు, పసర, నార్లాపూర్ మీదుగా మేడారం చేరుకుంటాయి,
? తిరుగు ప్రయాణంలో నార్లాపూర్, బయ్యక్క పేట, గోళ్లబుద్ధరం కమలాపురం క్రాస్ మీదుగా భూపాలపల్లి, రేగొండ, పరకాల,గుడేపాడ్ మీదుగా హన్మకొండకు చేరుకుంటారు,…
? గోదావరిఖని, మంచిర్యాల, పెద్దపెల్లి, మహారాష్ట్ర, కాళేశ్వరం కాటారం మీదుగా వచ్చే వాహనాలు, భూపాలపల్లి,ములుగు ఘన్ పూర్, జంగాల పల్లి నుంచి పసర, నార్లాపూర్ మీదుగా మేడారం చేరుకుంటాయి
? తిరుగు ప్రయాణంలో నార్లాపూర్, బయ్యక్కపేట, కమలాపురం క్రాస్ నుండి కాటారం లేదా కాల్వపల్లి, సింగారం, బోర్లగూడెం, పెగడ పల్లి, చింతకాని,మీదుగా కాటారం, చేరుకోవచ్చు.
? ఛత్తీస్ ఘడ్, భద్రాచలం, మణుగూరు నుంచి వాహనాలు, ఏటూరు నాగారం, చిన్న బోయినపల్లి, కొండయి, ఉరట్టం మీదుగా మేడారం చేరుకుని, తిరుగు ప్రయాణంలో ఇదే దారిలో వెళ్ళిపోతారు.
? మహబూబాబాద్ నుంచి వచ్చే వాహనాలు, నర్సంపేట మీదుగా ములుగు మండలం మల్లంపల్లి హైవే దగ్గర కలిసి, ములుగు, పసర, నార్లాపూర్, మీదుగా, మేడారం చేరుకుని,
? తిరుగు ప్రయాణంలో నార్లాపూర్, కమలాపూర్ క్రాస్, భూపాలపల్లి, పరకాల, గుడెప్పాడ్ మీదుగా మళ్ళీ మల్లంపల్లి మీదుగా తమ గమ్య స్థానాలకు చేరుకుంటారు..