తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ఈ మహాజాతర కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో జంపన్నవాగు వద్ద ఉన్న కల్యాణకట్టల వెనుక ఎకరం స్థలంలో భక్తుల కోసం అటవీ శాఖ 100 ‘ఫారెస్ట్ గుడారాలు’ ఏర్పాటు చేసింది. 24 గంటలు ఈ గుడారంలో బస చేస్తే రూ.2వేలు, 12 గంటల బసకైతే రూ.వెయ్యి చెల్లించాలి. ఒక గుడారంలో ఐదుగురు బస చేయవచ్చు. రాత్రి వేళల్లో ఇబ్బందులు పడకుండా విద్యుద్దీపాలు, మంచినీటి సౌకర్యం, మొబైల్ టాయి లెట్లు ఏర్పాటు చేశామని డీఎ్‌ఫఓ రవికిరణ్ తెలిపారు. 77028 48103, 80962 10513 నంబరును సంప్రదించి ఈ గుడారాలు బుక్ చేసుకోవచ్చన్నారు. paytm సేవల కొరకు 95531 42346 ని సంప్రదించాలని అయన కోరారు.కాగా వచ్చే నెల 2న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు,ముఖ్యమంత్రి కేసీఆర్ మేడారం వెళ్లనున్న సంగతి తెలిసిందే.