వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రజా సమస్యలను మరింత దగ్గరగా తెలుసుకోవడమే కాకుండా.. వాటికి పరిష్కార మార్గాలను, ప్రనాళికలను రచించేందుకు చేపడుతున్న ప్రజా సంకల్ప యాత్ర టీడీపీకి అంతిమ యాత్ర కాబోతుందా..? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇందుకు కారణాలను కూడా చెబుతున్నారు రాజకీయ విశ్లేషకకులు.
ఒకసారి రాజకీయ విశ్లేషకులు చెప్పిన కారణాలను పరిశీలిస్తే.. ప్రస్తుతం ఏపీలో పాలనను కొనసాగిస్తున్న చంద్రబాబు సర్కార్ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫలాలను రప్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు. పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ, ఓటుకు నోటు, ఏపీలో మహిళలపై టీడీపీ నాయకులు, కార్యకర్తల
దాడులు ఇలా అన్ని విధాలా చంద్రబాబు సర్కార్ 2014 నుంచి అవినీతిలో కూరుకుపోయిందనీ, అంతటితో ఆగక ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసేందుకు వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్నారని చంద్రబాబు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.
మరో పక్క ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు జగన్‌కు మద్దతుగా పాదయాత్ర చేశారు. అయితే, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఢిల్లీలో వైసీపీ ఎంపీలతో పాదయాత్ర చేయగా.. ఆంధ్రప్రదేశ్‌లోని 25 పార్లమెంటు నియోజకవర్గాలు, 640 మండల కేంద్రాలతోపాటు గ్రామ గ్రామాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్‌కు మద్దతుగా పాదయాత్ర చేశారు.