ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడు, ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ వైసీపీ ఎమ్మెల్యే రోజా చెప్పిన మాట నిజమేనా..? ఆ మాట నిజం కాకపోతే వైసీపీ అన్న ప్రతీ మాటకు కౌంటర్ ఇచ్చే టీడీపీ.. నారా లోకేష్ విషయంలో మాత్రం ఎందుకు కౌంటర్ ఇవ్వలేదు. ఇప్పుడు ఇదే ప్రశ్న రాజకీయ విశ్లేషకులతోపాటు నెటిజన్లను వెంటాడుతోంది.
ఇంతకీ ఎమ్మెల్యే రోజా ఏమన్నదనేగా మీ డౌట్. అదేనండీ వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర ఇటీవల చిత్తూరు జిల్లా నగరికి చేరుకున్న సందర్భంలో ఎమ్మెల్యే రోజా టీడీపీపై తనదైన పంచ్లతో విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. ఇదే సందర్భంలో నారా లోకేష్ సీఎం చంద్రబాబు తనయుడు కాకుంటే.. మంత్రిగా కాదుకదా.. కనీసం వార్డు మెంబర్గా కూడా గెలవలేడు అని పంచ్ ఇచ్చింది. ఈ మాట తెలుగుదేశం పార్టీ నేతల చెవిన పడ్డా కూడా వైసీపీ శ్రేణులకు కౌంటర్ ఇచ్చేందుకు సరైన సమాధానం దొరకలేదు టీడీపీ వారికి. దీంతో మంత్రి నారా లోకేష్ గురించి రోజా చెప్పింది నిజమేనంటూ సోషల్ మీడియాలో నెటిజన్ల చర్చలు మొదలైపోయాయి.