చంద్రబాబుకు మంత్రి పదవి.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాత్ర.!!.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి చెప్పారు. రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబు ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎంతో సయోధ్యతో, కలిసిమెలిసి ఉండేవారని, తరువాత కాలంలో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీని వీడిన తరువాత రాజశేఖర్‌రెడ్డిని బద్ద శత్రువుగా చూసేవారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు ఉన్న సమయంలో కేఈ కృష్ణ మూర్తితో కలిసి తన ఇంటికి కూడా వారు వచ్చేవారని, ఆ సమయంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వారిని ఆప్యాయంగా పలకరించి ఇంట్లోకి కూడా ఆహ్వానించే వారని చెప్పింది. ఎన్టీఆర్ హయాంలో కాంగ్రెస్‌ను వీడి చాలా మంది నేతలు టీడీపీలోకి వెళ్లినా కూడా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఒక్కరే టీ పీసీసీ చీఫ్ పగ్గాలుపట్టి పార్టీని నడిపించారని చెప్పింది.
ఆ తరువాత కాలంలో చంద్రబాబు కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరడం జరిగిందని, చంద్రబాబు ఏపీకి 14 ఏళ్లు సీఎంగా ఉన్నా ఫలితమేమీ లేదని పేర్కొంది. నాడు అంజయ్యతో పోరాడి మరీ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చంద్రబాబు నాయుడుకు మంత్రి పదివి ఇప్పించారని చెప్పింది విజయమ్మ.