2014 ఎన్నికల్లో టీడీపీ కంటే వైసీపీకి కర్నూలులో ఎక్కువ స్థానాలొచ్చాయి. 2019 లో వాటిని తగ్గించాలని టీడీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వందల కొట్లు ఆశ చూపి టీడీపీ కండువ కప్పుతున్నారు. ఇందులో బాగంగానే రాయలసీమ పరిరక్షణ సమితి స్థాపించి సీమ ఉద్యమాన్ని నడిపిన బైరెడ్డి రాజశేఖర రెడ్డి టీడీపీలో చేరెందుకు సిద్ధమైపోయారు. త్వరలోనే ఆయన టీడీపీలో చేరనున్నారు. అయితే తన రాజకీయ ఉనికి కోసం బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తనపై ఆరోపణలు చేయడం హ్యాస్యాస్పదమని వైసీపీ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. మీడియా ముందు మాట్లాడుతూ.. పాణ్యం నియోజకవర్గ అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు. అంతేగాక బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి చరిత్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని.. ఆప్తులు అంటూనే, వారిపై సొంత కొడుకుతో దాడి చేయించిన నీచమైన ఘనత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిది అని ఆమె ద్వజమెత్తారు.
ఏపీలో గత నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తిరిగి ఆయన పంచనే చేరడానికి రెడి అయ్యారంటే అది మీరు కూడ తెలుసుకోవలని గౌరు చరిత అన్నారు. ఎన్నికల ముందు హత్యలు, దాడులతో ప్రజలను భయపెట్టడం బైరెడ్డికి వెన్నతో పెట్టిన విద్య ఆరోపించారు. చేతనైతే రానున్న ఎన్నికల్లో తనపై పోటీ చేయాలని ఆమె సవాల్ విసిరారు. అంతేకాదు ఎన్నికల్లో 150 ఓట్లు కూడా రాని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తనపై విమర్శలు చేయడం చాల విడ్డూరంగా ఉందన్నారు.
see also..వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర 1000 కి.మీ పూర్తి…ఏం సాధించాడో తెలుసా