ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తాజాగా ఒక ప్రముఖ తెలుగు న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో పలు ఆశక్తికర అంశాల పై స్పందించారు. నేడు పాదయాత్ర చేస్తున్న జగన్‌ను చూస్తుంటే .. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారే గుర్తుకు వస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. జగన్‌కు ఒక్క అవకాశం ఇచ్చి చూడాలని ప్రజలను ఆమె కోరారు. చంద్రబాబులాంటి వ్యక్తిని మరోసారి ఎన్నుకోవాల్సిన అవసరం లేదన్నారు.
వైఎస్ ఎంపీగా ఉన్న సమయంలో ఎంపీల మీటింగ్‌లో స్వయంగా నాడు ముఖ్యమంత్రిగా ఉన్నచంద్రబాబుతో.. 2000 సంవత్సరానికి ముందే రైతులకు సాగునీటి కొరత లేకుండా చేయాలంటే.. ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభించాలని వైఎస్ సూచించారన్నారు. అయితే చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఏనాడు ప్రాజెక్టుల గురించి పట్టించుకోని చంద్రబాబులాంటి వ్యక్తికి ప్రజలు మరోసారి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఏముందని విజయమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి విజయమ్మ చేసిన వ్యాఖ్యల పై చంద్రబాబు అండ్ కో ఎలా స్పందిస్తారో చూడాలి.