ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న తన బిడ్డ ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గురించి తల్లి వైఎస్ విజయమ్మ సంచలన వాఖ్యలు చేశారు. ఎవరినీ విమర్శించడం నాకు ఇష్టముండదు. నా బిడ్డకు ఒక్క దురలవాటు కూడా లేదు. చిన్న అబద్దం కూడా చెప్పడం తెలియదు. సిగరెట్ ముట్టడు. పబ్లకు వెళ్లే అలవాటు లేదు. నా బిడ్డకు పని చేయడం, ఇంట్లో అందరితో సంతోషంగా ఉండటమే తెలుసు. మీ అబ్బాయిని చూడు, మా అబ్బాయిని చూడు ఎలా పెంచానో… అని అసెంబ్లీలో చంద్రబాబు అన్నారు. కాని ఎవరి అబ్బాయి ఎలాంటి వాడో…ఏఏ అలవాట్లు గలవాడో… ఏంత తెలివి గలవాడో..రాజకీయల్లోకి వచ్చి .ఏంత మెజార్టీతో గెలిచాడో ఏపీ ప్రజలకు మాత్రమే కాకుండా ప్రపంచానికి తెలుసు నా బిడ్డ గురించి అని వైఎస్ విజయమ్మ అన్నారు. అంతేగాక అస్సెంబ్లీలో జగన్ను మంత్రులు రెచ్చగొట్టినప్పుడు, కొందరు నేతలు జగన్ గురించి ఏదేదో మాట్లాడినప్పుడు, అసత్య ఆరోపణలు చేసినప్పుడు నాకు తెలియకుండానే కన్నీళ్లొచ్చేవి. చాలా బాధ కలిగేది. జగన్ మాత్రం ధైర్యంగా ఎదుర్కొన్నాడు. వాళ్లు అలా అనకుండా ఇంకేమంటారమ్మా.. అంటూ నన్ను సముదాయించేవాడు అని ఆమె అన్నారు.
