ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు ప్రజాసంకల్పయాత్ర నెల్లూరు జిల్లాలో 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. మూడువేల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని ఆయన సోమవారం వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం వద్ద దాటారు. ఈ సందర్భంగా భారీగా వైసీపీ నేతలు,కార్యకర్తలు, అభిమానులు ,గ్రామస్థులు వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం పలికారు. పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన సైదాపురంలో స్తూపన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆశేశ జనాల మద్య పాదయాత్రను కొనసాగించారు. ఈ ప్రజాసంకల్పయాత్ర 75వ రోజు షెడ్యూల్ ఖరారు అయింది. మంగళవారం ఉదయం ఆయన వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడ నుంచి సిద్ధయ్యకోన, పొక్కనదాల క్రాస్, ఊటకూరు, గిద్దలూరు క్రాస్, తురిమెళ్ల, కలిచేడు వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. వైఎస్ జగన్ రాత్రికి కలిచేడులోనే బస చేస్తారు.
