ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ .. 2014లో అతి తక్కువతేడాతో అధికారం కోల్పోయినా దేశంలోనే అత్యంత శక్తివంతమైన ప్రతిపక్షనేతగా జగన్ కొనసాగుతున్నారు. అలాగే వైఎస్ జగన్ భార్య భారతి సాక్షి మీడియాకు చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. అదే బాటలో ఇప్పుడు వారి కుమార్తెలు నడుస్తున్నారు. జగన్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు.. వారి పేర్లు వర్ష, హర్ష..అయితే జగన్ దంపతులు గర్వించే ఘనతను కుమార్తె సాధించిన విషయం తెలిసిందే..పెద్ద కుమార్తె వర్ష ప్రతిష్టాత్మక లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో సీటు సాధించింది. లండన్ లోని ఈ విద్యాసంస్థల్లో సీటు సాధించడం ఆషామాషీ కాదు. చాల తెలివి గల వారు మాత్రమే సీటు సాదిస్తారు. మరి ఇంత చిన్న వయస్సులో సీటు సాదించడానికి గల కారణం ఓ టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తెలిపారు. నా మనువారాలు చాలా తెలివైనది. ఎక్కడైనా సీటు వస్తుంది. బాగా చదువుతుంది. సబ్జెక్టు పుస్తకాలే కాకుండా నాలెడ్జ్ పెరిగే ఇతర పుస్తకాలు కొన్ని వేలు చదివింది.అందుకే లండన్ స్కూల్‌లో సీటు వచ్చిందని బాగా అర్థమవుతున్నది. అంటే వైఎస్ జగన్ కుమార్తె ఇంత చిన్న వయస్సులో అన్ని వేల పుస్తకాలు చదివిదంటే అత్యంత శక్తివంతమైన మహిళగా రికార్డ్ సృష్టిస్తుందని వైసీపీ అభిమానులు అంటున్నారు.