భార్య శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడికించాడో భర్త. ఈ సంఘటన మెక్సికోలో చోటు చేసుకుంది. కాగా, సీసర్ లోపేష్, ముగ్దలీనా భార్యా భర్తలు. రెండేళ్ల క్రితం పెళ్లిచేసుకున్న వీరు ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. ఇంతలో వీరిద్దరి మధ్య పొసగకపోవడంతో విడాకులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సీసర్ లోపేష్ ఇద్దరు పిల్లల్ని తన వద్దే ఉంచుకున్నాడు. ఒక రోజు సాయంత్రం వేళ ముగ్దలీనా పిల్లలను చూసేందుకు సీసర్ లోపేష్ ఇంటికి వెళ్లింది. అలా వెళ్లిందో.. లేదో ఇక కనిపించకుండా పోయింది.
అనుమానం వచ్చిన ముగ్దలీనా కుటుంబ సభ్యులకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణలో విస్తుగొల్పే అంశాలు వెలుగులోకి వచ్చాయి. సీసర్ లోపేస్ అసలు నిజాన్ని ఒప్పుకున్నాడు ముగ్దలీనాను తానే చంపానని, ముగ్దలీనా శరీర భాగాల్ని ముక్కలు ముక్కలుగా చేసి కొన్ని ముక్కలను గ్యాస్‌పై ఉడికించానని, మరికొన్ని భాగాలను ఫ్రిజ్‌లో ఉంచానని చెప్పాడు సీసర్ లోపేస్.